Vijayashanti: పెళ్లి తర్వాత విజయశాంతిని టార్చర్ చేసిన భర్త..ఆ హీరోతో నటిస్తే ఇంట్లో చుక్కలే..?
Vijayashanti: విజయశాంతి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ హీరోయిన్ తన నటనతో స్టార్ హీరోలను సైతం పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేసింది. ఓవైపు స్టార్ హీరోలకు దీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంది. అప్పట్లో అత్యధిక రెమ్యూనేషన్ తీసుకున్న హీరోయిన్గా కూడా విజయశాంతికి పేరు ఉండేది.అలా హీరోలకు ఏమాత్రం తీసిపోని సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు పోటీగా తన సినిమాలు కూడా విడుదల చేసేది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయ్యాక నిజంగానే తన భర్తతో టార్చర్ అనుభవించిందా..ఆ హీరోతో సినిమాలు చేయకని ఇంట్లో భర్త టార్చర్ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం..
The husband who tortured Vijayashanti after the wedding
హీరోయిన్ విజయశాంతి ప్రస్తుతం సినిమాలు మానేసి రాజకీయాల్లోనే ఉంది. ఎలక్షన్స్ కు ముందు బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న విజయశాంతిని అందరూ రాములమ్మ అని పిలుస్తారు.ఈమె నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అప్పటినుండి రాములమ్మగా విజయశాంతి పిలవబడుతుంది.అయితే అలాంటి విజయశాంతి అప్పట్లో నందమూరి బాలకృష్ణకు హిట్ పెయిర్ అనే పేరు తెచ్చుకుంది.వీరిద్దరి కాంబోలో ఏ సినిమా వచ్చినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. (Vijayashanti)
Also Read: Anasuya slams trolls: బికినీ వేసుకుంటా.. లేదంటే విప్పుకుని తిరుగుతా.. నా ఇష్టం..అనసూయ ఫైర్!!
అలా తెర మీద వీరి కెమిస్ట్రీకి మంచి పేరుంది.అయితే అలాంటి ఈ జోడి పెళ్ళయ్యాక ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. విజయశాంతి బాలకృష్ణ దూరపు బంధువైన శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుంది వీరికి పిల్లలు లేరు. అయితే పెళ్లయ్యాక విజయశాంతి బాలకృష్ణతో సినిమాలు తగ్గించేసింది. దానికి రెండు మూడు కారణాలు వినిపించాయి. అందులో ఒకటి బాలకృష్ణ కి శ్రీనివాస్ దూరపు బంధువు కావడంతో విజయశాంతి భర్త శ్రీనివాస్ బాలకృష్ణ తో సినిమాలు చేయకూడదు అని ఇంట్లో ఆమెకు కండిషన్ పెట్టినట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి.
అలాగే మరో కారణం ఏంటంటే..విజయశాంతికి కాస్త ఈగో ఎక్కువగా ఉంటుందట. అందుకే స్టార్ హీరోల దగ్గర విజయశాంతి కాస్త ఈగో ప్రదర్శించి కొంతమంది హీరోలకు దూరమైందట. అలా వాళ్ళ సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా ఇగో కారణంగా వాటిని రిజెక్ట్ చేసిందట. ఆ లిస్టులో బాలకృష్ణ, చిరంజీవి కూడా ఉన్నారంటారు. అలా బాలకృష్ణతో సినిమాలు తగ్గించడానికి ఇంట్లో భర్త అసహనంతో పాటు ఇగో కారణంగా సినిమాలు చేయలేదని అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్నారు.(Vijayashanti)