Virat Kohli: కోహ్లీ రెస్టారెంట్‌లో అత్యంత ఖరీదైన గొర్రె మాంసం..?
Virat Kohli: విరాట్ కోహ్లీ రెస్టారెంట్ One8 కమ్యూన్. ప్రస్తుతం ఖరీదైన మెనూతో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ వార్తల్లో నిలిచింది. విరాట్ కోహ్లీ 2017లో One8 కమ్యూన్ రెస్టారెంట్ చైన్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ఇప్పుడు దేశంలోని అనేక పెద్ద నగరాలలో అవుట్ లెట్లను కలిగి ఉంది. ఇటీవల హైదరాబాద్ లోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో ఓ విద్యార్థి మొక్కజొన్నను ఆర్డర్ చేయకగా దానికి రూ. 525 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.
The most expensive mutton in Kohli’s restaurant
అప్పటి నుంచి One8 కమ్యూన్ మెనూ వార్తల్లో నిలిచింది. One8 కమ్యూన్ మెనూలో అత్యంత ఖరీదైన వంటకం లాంబ్ షాంక్స్. ఈ వంటకం గొర్రె మాంసంతో తయారుచేస్తారు. లాంబ్ షాంక్స్ చేయడానికి గొర్రె కాళ్ళను తక్కువ మంటలో వండుతారు.
Rishabh Pant: రిషబ్ పంత్ కు ఢిల్లీ కెప్టెన్సీ ?
One8 కమ్యూన్ ఈ వంటకం ధర రూ. 2,318. విరాట్ కోహ్లీకి చెందిన ఈ రెస్టారెంట్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, కోల్కత్తాలో ఉన్నాయి. నివేదికల ప్రకారం విరాట్ కోహ్లీ ఇప్పుడు దుబాయ్ లో ఈ రెస్టారెంట్ ఔట్ లెట్ ను ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. వచ్చే నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీతో విరాట్ కోహ్లీ బరిలోకి రానున్నాడు.