Sridevi: డబ్బు కోసం శ్రీదేవిని ఆయనకిచ్చి పెళ్లి చేయాలనుకున్న తల్లి.?

Sridevi: పాన్ ఇండియా అనే పదం సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేకముందే ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీదేవి.. ఈమె అప్పట్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో తన మానియా చూపించింది.. చిన్నతనంలోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తిరుగులేని హీరోయిన్ గా మారి ఎందరికో కలల రాకుమారి అయింది.
The mother who wanted to marry Sridevi to him for money
అలాంటి శ్రీదేవి తాను చనిపోయే వరకు కూడా హీరోయిన్ గానే చేసింది తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించలేదు.. అలాంటి శ్రీదేవిని యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎంతో మంది హీరోలు పెళ్లి చేసుకోవాలని ట్రై చేశారట. పెళ్లయిన బోనీకపూర్ కు మాత్రమే ఆ అదృష్టం దక్కింది.. కానీ శ్రీదేవే తనను పెళ్లి చేసుకోవాలని ఒక టాలీవుడ్ హీరోకు ప్రపోజల్ పెడితే ఆయన మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారట.. మరి వారు ఎవరు వివరాలు చూద్దాం..(Sridevi)
Also Read: RGV: అమ్మాయిల్లో అవే మత్తెక్కిస్తాయి.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు మురళీమోహన్.. ఆయన రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్లారు. అలాంటి ఈయన కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయనను చూసినటువంటి శ్రీదేవి తల్లి తన కూతురిని మురళీమోహన్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుందట.. అంతేకాదు పెళ్లి ప్రపోజల్ కోసం ఓ రోజు శ్రీదేవిని తీసుకొని తన ఇంటికి డైరెక్ట్ గా డిన్నర్ కి వెళ్లిందట..

సడన్ గా మురళీమోహన్ ఇంట్లో తన భార్య పిల్లలను చూసి షాక్ అయిపోయిందట. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని తన తల్లి మురళీమోహన్ అడగడంతోనే నాకు పెళ్లయింది పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయిందట.. అసలు నీకు పెళ్లి అయిన విషయం మరో వ్యక్తికి తెలియదు, పిల్లలు కూడా ఉన్నారా అంటూ శ్రీదేవి తల్లి మురళీమోహన్ అడిగి, డిన్నర్ చేసి వెనుతిరిగిందట. అలా మురళీమోహన్ తో శ్రీదేవి పెళ్లి మిస్ అయిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.(Sridevi)