Tandel: తండేల్ సినిమా ప్లస్లు మైనస్లు.. ఆ మిస్టేక్ లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్.?
Tandel: ఒక్క సినిమా చాలు హీరో హీరోయిన్ల కెరియర్ ను మార్చడానికి, ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమాను అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు.. కానీ కొన్ని సినిమాలు ఎన్నో అంచనాల నడుమ వచ్చి ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. మరికొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ కొడతాయి.. అలా ఇండస్ట్రీలో ఒక భారీ హిట్టు కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు అక్కినేని హీరో నాగ చైతన్య.. మొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో మన ముందుకు వచ్చారు. చందు మొండేటి డైరెక్షన్ లో ఎనర్జిటిక్ హీరోయిన్ సాయిపల్లవి కథానాయికగా చేస్తున్నటువంటి మూవీ తండేల్..

The pluses and minuses of the movie Tandel
ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలు అమెరికా, ఇండియా వంటి దేశాల్లో జనాలు చూసేశారు.. సినిమా చూసి వచ్చినటువంటి చాలామంది ట్విట్టర్ వేదికగా సినిమా ఎలా ఉందో తెలియజేస్తున్నారు.. ఈ తండేల్ సినిమాకి సంబంధించి, ప్లస్, మైనస్ లు ఏంటో ఓసారి తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే శ్రీకాకుళంలో జీవించే మత్స్యకారుల పరిస్థితిని ఆధారంగా చేసుకొని చాలా రియలెస్టిక్ గా సినిమా తీశారు.. చేపలు పడుతూ కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ బార్డర్ దాకా వెళ్లి అక్కడి కోస్ట్ గార్డుకు చిక్కి శిక్ష అనుభవించారు.. దీన్ని ఆధారంగా చేసుకుని చందు మొండేటి అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం నాగచైతన్య కూడా చాలా కష్టపడ్డారట.. మత్స్యకారుల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందట. అలాంటి ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? ఈ సినిమాలో నచ్చని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.?(Tandel)
Also Read: Thandel Movie OTT: ‘తండేల్’ మూవీ ఓటీటీ.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
సినిమాకు కలిసి వచ్చేవి:
ముఖ్యంగా ఈ చిత్రం చూస్తుంటే రియల్ గా మత్స్యకారులను చూసినట్టే అనిపిస్తుంది. ఆ పాత్రలో నాగచైతన్య నటించడమే కాదు జీవించేశారు. అంతేకాకుండా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మరో కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు. ఇక ఎంతో ఎనర్జీటిక్ గా నటిస్తూ డాన్స్ చేసే సాయి పల్లవి ఇందులో కథానాయికగా రావడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మత్స్యకారుల పాత్రలో నాగచైతన్య నటనతో అధరహో అనిపించారు.. ఇక ఇందులో నాగచైతన్య పాకిస్తాన్ వాళ్లకు తిట్టిన తర్వాత ఆయన ఇండియాపై చూపించే ప్రేమను అద్భుతంగా చూపించారు. మొత్తానికి సముద్రంపై తీసే సీన్లు చాలా రియల్ గా ఉంటాయి.. మొత్తానికి సినిమా మొదటి భాగం కంటే రెండో భాగం క్లైమాక్స్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు..

నచ్చని పాయింట్లు:
సాయిపల్లవి నాగచైతన్య మధ్య సాయి లవ్ స్టోరీ బాగా లాగి చూపించారని చెప్పవచ్చు. అంతేకాకుండా సినిమా స్టార్ట్ అయిన మొదటి కొన్ని నిమిషాల పాటు చాలా బోరింగ్ అనిపిస్తుంది..(Tandel)