Gorantla Madhav: వైసీపీ పార్టీలో మరో అరెస్ట్ ?
Gorantla Madhav: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ నేత అరెస్టు అవుతాడు అనే ఆందోళన అందరిలోనూ ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్టు కాగా… తాజాగా పోసాని కృష్ణమురళి ని కూడా అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాదులో ఉన్న పోసాని కృష్ణమురళికి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం జరిగింది.

The police went to the house of former YCP MP Gorantla Madhav
తెలంగాణ పోలీసుల అనుమతులు తీసుకొని అర్ధరాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. అయితే ఇది ఇలా ఉండగా… వైసిపి పార్టీకి మరో షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. మరో నేతను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
Ibrahim Zadran: రికార్డుల వరద పారిస్తున్న ఇబ్రహీం జద్రాన్.. మాజీల రికార్డులు గల్లంతు!!
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. విజయవాడలో నమోదైన ఓ కేసు విషయంలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2024లో వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు. ఫోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని ఆయనపై 72, 79 BNS సెక్షన్ల కింద కేసు నమోదైంది.