The producer has a grudge against Raj Tarun

Raj Tarun: రాజ్ తరుణ్ పై కావాలనే ఆ టాలీవుడ్ నిర్మాత కేసు పెట్టించాడా..ఈ కేసులో లావణ్యని బలవంతం చేసి ఆ నిర్మాత రాజ్ తరుణ్ పై పగ తీర్చుకున్నాడా.. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు.. రాజ్ తరుణ్ చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం..రెండు మూడు రోజుల నుండి మీడియాలో రాజ్ తరుణ్ ఆమె ప్రియురాలు లావణ్య వ్యవహారం ఎంతగా వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు.

The producer has a grudge against Raj Tarun

అయితే రాజ్ తరుణ్ ప్రస్తుతం తీరగబడరా సామి అనే మూవీ చేస్తున్నారు. కొంతమందేమో ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అందరూ మర్చిపోయిన రాజ్ తరుణ్ ని ఈ వివాదం ద్వారా ఒక్కసారిగా వైరల్ అయ్యి సినిమా నీ అందరూ చూడాలనే ఈ విధంగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారని అంటుంటే,మరి కొంతమందేమో ఇది నిజమే అని అంటున్నారు. (Raj Tarun)

Also Read: Raj Tarun: లావణ్య తో ఎఫై** రాజ్ తరుణ్ కి 10 ఏళ్ళు జైలు శిక్ష.?

అయితే రాజ్ తరుణ్ పై కి లావణ్యని ఉసిగొల్పి కేసు పెట్టింది ఓ టాలీవుడ్ నిర్మాత అని తెలుస్తోంది.అయితే లావణ్య ఈ విషయాన్ని అంత పెద్దగా చేయాలి అనుకోలేదట. కానీ ఆ నిర్మాతనే లావణ్యతో ఇది చేయించారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.

The producer has a grudge against Raj Tarun

ఎందుకంటే గతంలో రాజ్ తరుణ్ ఆ నిర్మాత కి కాల్షీట్లు ఇచ్చి సినిమా చేస్తానని చెప్పి చివరికి హ్యాండ్ ఇచ్చి వేరే సినిమాలో నటించారట.దాంతో రాజ్ తరుణ్ పై కోపం తెచ్చుకున్న ఆ నిర్మాత ఇప్పుడు ఇలా లావణ్య రూపంలో ఆయనపై పగ తీర్చుకుంటున్నాడని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి లావణ్య, రాజ్ తరుణ్,మాల్వి మల్హోత్రాల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది.(Raj Tarun)