Heroine: హీరోయిన్ మీద మోజుతో సినిమా తీసి బొక్క బోర్లా పడ్డ నిర్మాత..?

Heroine: కొంతమంది నిర్మాతలు తమకు కలిసొచ్చిన కాంబోతో సినిమాలు తీయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా ఈ టాలీవుడ్ నిర్మాత కూడా హీరోయిన్ మీద పూర్తి నమ్మకం పెట్టుకొని సినిమా చేసి చివరికి బొక్క బోర్ల పడ్డాడు. మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? ఏ హీరోయిన్ మీద ప్రేమతో ఈ సినిమా తీశారు అనేది ఇప్పుడు చూద్దాం. దివంగత నటి దివ్యభారతి చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని చివరికి సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అనుమానస్పదంగా మరణించిన సంగతి మనకు తెలిసిందే.
The producer who made a film with a crush on the Heroine and got screwed
దివ్యభారతి డెత్ ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే అలాంటి దివ్యభారతి సౌత్లో కాకుండా బాలీవుడ్ లో స్టార్ నటి.. అలా బాలీవుడ్లో స్టార్ అవ్వడంతో ఈమెని సౌత్ లోకి తీసుకువచ్చారు. ఇక దివ్యభారతి తెలుగులో వెంకటేష్ మోహన్ బాబు నాగార్జున చిరంజీవి వంటి హీరోలతో సినిమాలు చేసింది.ముఖ్యంగా మోహన్ బాబుతో రెండు సినిమాలు చేసింది.(Heroine)
Also Read: Vineetha: ఆయన వల్లే వెంకటేష్ హీరోయిన్ వ్యభి**రంలో ఇరుక్కుందా.?
అందులో ఒకటి చిట్టెమ్మ మొగుడు మరొకటి అసెంబ్లీ రౌడీ.ఈ రెండు సినిమాల్లో అసెంబ్లీ రౌడీ సినిమా బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అనే పేరు వచ్చింది. అయితే ఈ సినిమా హిట్ కొట్టడంతో మళ్ళీ వీరి కాంబోలో చిట్టెమ్మ మొగుడు అనే సినిమా తీశారు. అయితే అసెంబ్లీ రౌడీ సినిమాకి మంచు మోహన్ బాబు లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ లో నిర్మాతగా మరియు హీరోగా చేశారు.

కానీ చిట్టెమ్మ మొగుడు సినిమాపై నమ్మకం లేకపోవడంతో నిర్మాతగా మోహన్ బాబు తప్పుకోవడంతో పి.శ్రీధర్ రెడ్డి ఈ మూవీకి నిర్మాతగా మారారు.ముఖ్యంగా దివ్యభారత్ మీద నమ్మకంతో పి శ్రీధర్ రెడ్డి చిట్టెమ్మ మొగుడు సినిమా నిర్మించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది.దాంతో చివరికి హీరోయిన్ ని నమ్ముకొని నిర్మాత అప్పుల పాలైనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.(Heroine)