Sunil: సునీల్ బతికుండడానికి కారణం ఆ స్టార్ హీరోనా.. కారు ప్రమాదంలో..?
Sunil: కమెడియన్ సునీల్ అంటే పరిచయాలు అక్కర్లేని పేరు. అయితే అలాంటి కమెడియన్ సునీల్ ఓసారి కారు ప్రమాదంలో చెప్పుకున్నారట. కానీ ఆ హీరో వల్లే ఈయన బతికి బయటపడ్డారట.మరి ఇంతకీ సునీల్ ప్రాణాలు కాపాడిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. కమెడియన్ సునీల్ ప్రాణాలు కాపాడిన హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.అవును మీరు వినేది నిజమే. స్వయంగా ఇవి సునీల్ మాట్లాడిన మాటలే.

The reason why Sunil is alive is that star hero
అయితే మెగాస్టార్ చిరంజీవి సునీల్ ప్రాణాలు ఎలా కాపాడారంటే.. గతంలో చిరంజీవికి ఇష్టమైన ఓ కారు ఉండేది. ఆ కారు పేరు ల్యాండ్ క్రుయీజ్. ఇది ఎంతో ఇష్టంతో కొనుక్కున్నారు. అయితే అప్పట్లోనే ఈ కారుకి ఎన్నో ఫీచర్లు ఉండేవట. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు శ్రీకాంత్ చిరంజీవి దగ్గర కార్ కొనుక్కున్నారట. ఇక చిరంజీవి కారు శ్రీకాంత్ కొనుక్కున్నాక ఓ రోజు ఊరు వెళ్లి వస్తానని సునీల్ శ్రీకాంత్ చిరంజీవి దగ్గరకొన్న కారుని తీసుకొని వెళ్ళారట. ( Sunil)
Also Read: Namitha: ఊరి చివర బంగ్లాలో నమిత.. అర్ధరాత్రి అలాంటి పని చేస్తూ భర్తకు దొరికి.?
అలా వెళ్తున్న సమయంలో కార్ ప్రమాదానికి గురైందట. కానీ ఆ టైంలో చిరంజీవి చెప్పినట్లుగా సునీల్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారట.అయితే ఈ కారు ప్రమాదం జరిగే కొద్దిసేపటికి ముందే సీట్ బెల్ట్ పెట్టుకున్నారని,ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కారణంగా తనకేమీ ప్రమాదం జరగలేదని సునీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే దీనంతటికీ కారణం చిరంజీవేనని, చిరంజీవి ప్రతిసారి సీటు బెల్ట్ పెట్టుకోవాలని జాగ్రత్తలు చెబుతారని, ఆయన చెప్పిన జాగ్రత్తే ఆ రోజు నా ప్రాణాలు కాపాడింది అని,ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం చిరంజీవి గారే అంటూ సునీల్ చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి దగ్గర శ్రీకాంత్ కొన్న ల్యాండ్ క్రుయీజ్ కారు కి అప్పట్లోనే భారీ ఫీచర్స్ ఉండేవట.అందుకే అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా కారుకి ఏమీ కాలేదట.( Sunil)