Allu Arjun: అల్లు అర్జున్ భార్యకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం..ఆ కక్షతోనే అరెస్ట్..?
Allu Arjun: ప్రస్తుతం సోషల్ మీడియా మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్ గురించే వార్తలు వస్తున్నాయి. పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా వేసినటువంటి బెనిఫిట్స్ షో సందర్భంగా ఎక్కువ మంది జనాలు థియేటర్స్ కి రావడంతో, ఇదే తరుణంలో అల్లు అర్జున్ రష్మిక మందాన ఇతర కుటుంబ సభ్యులు థియేటర్స్ కు వచ్చి సినిమా చూస్తున్నారని తెలిసి జనాల తాకిడి మరింత పెరిగింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. దీంతో అల్లుఅర్జున్ పై కేసు నమోదయింది.
The relationship between Allu Arjun wife and Revanth Reddy
అయితే ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆయన అరెస్టు అయిన వెంటనే సోషల్ మీడియా వేదికగా మెయిన్ మీడియాలో ఇదంతా రేవంత్ రెడ్డి చేయించారని ఒక వార్త ఊపందుకుంది.. ఇక బన్నీ అభిమానులు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇదే తరుణంలో దీనిపై స్పందించినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే జాతీయ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అల్లు అర్జున్ అరెస్టులో ఎలాంటి రాజకీయం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. (Allu Arjun)
Also Read: Allu Arjun: టైమ్ చూసి వీకెండ్ లోనే అల్లు అర్జున్ అరెస్ట్.. ఎవరి స్కెచ్ ఇది?
చట్టం తన పని తాను చేసుకుపోతుందని దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. కొంతమంది నటీనటులు వాళ్ళ లాభాల కోసం ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తున్నారని, అలాంటివారు తప్పు చేస్తే అరెస్టు చేయడం తప్పేది కాదని, హీరోలు ఏమైనా బార్డర్ లో యుద్ధాలు చేసి దేశాన్ని కాపాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఒక తల్లి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతే, కేసులు పెట్టకూడదా అని నిలదీశారు.
చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదని చెప్పకనే చెప్పారు. మాకు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కుటుంబానికి మంచి బంధుత్వం ఉందని అన్నారు. అల్లు అర్జున్ మామ మరియు మెగాస్టార్ చిరంజీవి కూడా మా పార్టీ వారే కదా అంటూ చెప్పుకొచ్చారు. పార్టీలో ఉన్నా కానీ, దగ్గర బంధువులు అయినా సరే చట్టం తన పని తాను చేసుకోక మానదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్నేహరెడ్డి తనకు బంధువు అని చెప్పడంతో సోషల్ మీడియా వేదికగా ఈ విషయం వైరల్ గా మారింది.(Allu Arjun)