Saif Ali Khan: వై.ఎస్. షర్మిల కి సైఫ్ అలీ ఖాన్ కి మధ్య రిలేషన్.. ఫైనల్ గా గుట్టురట్టు..?
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. అప్పట్లో కేవలం బాలీవుడ్ కే పరిమితమైన ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో అందరికీ సుపరిచితంగా మారారు. అలాంటి ఈ హీరోపై తాజాగా దుండగుడు కత్తితో దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ అలీ దారుణంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
The relationship between Sharmila and Saif Ali Khan
సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా సైఫ్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి.. అలాంటి ఈ తరుణంలోనే హీరో సైఫ్ ఆలీ ఖాన్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారిన వైఎస్ షర్మిలకు ఒక సంబంధం ఉందని సోషల్ మీడియా వేదికగా ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉంది షర్మిల ఠాకూర్. (Saif Ali Khan)
Also Read: Manchu Vishnu: వినాయకుడి పాట ఆ క్రిస్టియన్ దే.. మరో వివాదంలో మంచు విష్ణు.?
ఈమె అప్పట్లో దేశవాళి క్రికెట్ కు కెప్టెన్ గా ఉన్నటువంటి మన్సుర్ ఆలీ ఖాన్ ను వివాహమాడింది. ఈ దంపతులకు పుట్టిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్.. ఇకపోతే షర్మిల అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఉండేది. ఈమెకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉండేవారు. ఇందులో అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఒకరు. ఆమెను ఎంతగానో అభిమానించేవారు. అంతేకాదు తన కూతురు పుట్టిన తర్వాత ఆమెకు షర్మిల అని పేరు పెట్టింది కూడా షర్మిల ఠాగూర్ పై అభిమానంతోనేనట..
సాధారణంగా తెలుగు వాళ్ళు ఇలాంటి పేరు అస్సలు పెట్టుకోరు. వైయస్సార్ ఆమె మీద అభిమానంతో ఈ పేరు పెట్టుకోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సైఫ్ అలీ ఖాన్ కు, షర్మిల కుటుంబానికి ఇంత దగ్గర సంబంధం ఉందా అంటూ ప్రత్యేకమైన వార్తలు రాస్తూ వైరల్ చేస్తున్నారు.. ఇక సైఫ్ అలీ ఖాన్ కెరియర్ విషయానికి వస్తే తల్లి బాటలో సినిమాల వైపు అడుగులు వేసి స్టార్ హీరోగా మారారు.(Saif Ali Khan)