Nayanthara: షూటింగ్లో నయనతారను టార్చర్ చేసిన సీనియర్ హీరో.?
Nayanthara: హీరోయిన్ నయనతార దక్షిణాది సినిమా ఇండస్ట్రీలలో ఎంతో గుర్తింపు పొందినటువంటి ముద్దుగుమ్మ. అంద చెందాలతోనే కాకుండా నటన అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేయాలంటే నయనతార పేరు ముందు గుర్తుకొస్తుంది. అలా టాప్ లెవల్లో దూసుకుపోతున్న నయనతార తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడిందట.
The senior hero who tortured Nayanthara during the shoot
అలాంటి ఈ ముద్దుగుమ్మ ఆ హీరో వల్ల ఎంతో ఇబ్బందిపడి చివరికి ఆయనపై సీరియస్ అయి అవమానపరిచిందట. మరి ఆమె ఎందుకు సీరియస్ అయింది ఆ వివరాలు ఏంటో చూద్దాం. నయనతార ఇండియాలోని అత్యంత పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. సినిమాలే కాకుండా పలు యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది. మలయాళ కుటుంబంలో పుట్టినప్పటికీ మళయాలం పూర్తిగా రాదు. (Nayanthara)
Also Read: Sobhita: పెళ్లైన 10 రోజులకే భర్తతో శోభిత గొడవ.. పబ్లిక్ లో ఎలా తిట్టిందో చూడండి.?..?
తమిళంలో అద్భుతంగా మాట్లాడుతుంది అర్థం చేసుకుంటుంది. అలా నయనతార మలయాళం రాకపోవడం వల్ల మోహన్ లాల్ తో సినిమా చేసేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొందట. అయితే మోహన్ లాల్ తో సినిమా చేసే సమయంలో భాష అర్థం కాకపోవడం వల్ల మోహన్ లాల్ పైనే సీరియస్ అయిందట.. నాకు మీరు చెప్పేది అర్థం కానప్పుడు ఏవిధంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటూ ఆయనపై అరిచిందట.. అలా ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని, చివరికి నన్ను అర్థం చేసుకున్న డైరెక్టర్ రెస్ట్ తీసుకో అమ్మ అని చెప్పి పంపారట.. (Nayanthara)
కానీ మోహన్ లాల్ మాత్రం నన్ను బలవంతం చేస్తూ ఏదైనా అర్థం చేసుకోవాలని అనేవారని, నాకు వాళ్ళు చెప్పేది అర్థం కాక నేను సీరియస్ అయ్యే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నయనతార విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని అద్భుతమైన జీవితాన్ని గడుపుతోంది. నయనతారకు ఇద్దరు మగ కవల పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం వారితో గడుపుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ.(Nayanthara)