Soundarya: సౌందర్య మరణం లో బయటపడ్డ షాకింగ్ నిజం.. చనిపోయిన ఇన్ని రోజులకు.?
Soundarya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి తన నటనతో అదరగొట్టింది. అలా సావిత్రి తర్వాత ఆ స్థానాన్ని సౌందర్య అధిరోహించింది. అప్పట్లో సౌందర్య హీరోయిన్ గా వస్తుంది అంటే ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. అలా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సౌందర్య అకాల మరణం చెందడంతో ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
The shocking truth revealed in Soundarya death
అయితే సౌందర్య అకాల మరణానికి కారణం ఆమె ప్రేమ పెళ్లే అని తెలుస్తోంది.. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. బెంగళూరుకు చెందిన సౌందర్య తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి క్రేజ్ సంపాదించింది. అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే సౌందర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఒకవేళ ఆమె మరణించి ఉండకపోతే ఇప్పటికే పెద్ద రాజకీయ నాయకురాలు అయ్యేది. (Soundarya)
Also Read: Game Changer: పుష్ప-2 పోలిస్తే గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్లు అంత తక్కువా.. వెరీ బ్యాడ్.?
అలాంటి సౌందర్య మరణించిన తర్వాత చాలామంది ఆమె మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టారు. కానీ అసలు నిజం ఏంటయ్యా అంటే.. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. సౌందర్యకు మామ వరుసయ్యే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు జాతకాలు చూపించారట. ఆ వ్యక్తిని సౌందర్య పెళ్లి చేసుకుంటే దోషం ఉంటుందని చెప్పారట.
దీంతో సౌందర్య తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోయినా వాళ్లని ఎదిరించి ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఆమె మరణించిన ఇన్నేళ్ల తర్వాత ఆమె దోషం వల్లే మరణించిందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఒక గొప్ప నటి ఇండస్ట్రీకి దూరమవ్వడం బాధాకరమని చెప్పవచ్చు.(Soundarya)