Mohan Babu: మోహన్ బాబు కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..అంత అవమానమా..?

Mohan Babu: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా టాప్ 3లో డైరెక్టర్ రాజమౌళి ఉంటారని చెప్పవచ్చు. ఆయన ఏ సినిమా తీసిన తప్పకుండా ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంది. అంతేకాదు ఈయన సినిమా వల్ల దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్స్ ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా మంచి పేరు వస్తుంది. ఈ విధంగా రాజమౌళి సినిమా అంటే అన్ని రకాల లాభాలే తప్ప నష్టం అనేది ఉండదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును ప్రపంచ దేశాలు గుర్తించేలా చేసిన డైరెక్టర్లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు.
The star director who warned Mohan Babu
అలాంటి ఈయనతో ఒక్క సినిమా చేసిన చాలని ఎంతోమంది హీరో హీరోయిన్లు ఇతర నటీనటులు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి రాజమౌళిని ఆ స్టార్ హీరో తన కొడుకుతో సినిమా చేయాలని చాలాసార్లు అడిగారట. మరి ఆయన ఎవరు వివరాలు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ గా ఎదిగిన హీరోలలో మోహన్ బాబు ఒకరు. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈయన నట వారసులుగా ఇండస్ట్రీలోకి మంచు విష్ణు, మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ వీళ్లు ఇప్పటికీ కూడా స్టార్డం సంపాదించుకోలేక సతమతమవుతున్నారు. (Mohan Babu)
Also Read: Chiranjeevi: ఆ హీరో భార్యతో చిరంజీవి రొమాన్స్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?
అలాంటి ఈ తరుణంలో మంచు మోహన్ బాబు రాజమౌళిని బ్రతిమిలాడి మరి నా కొడుకుతో సినిమా తీయాలని అనేవారట.. అయితే రాజమౌళి డైరెక్షన్ చేసిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు యముడి పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాజమౌళిని మోహన్ బాబు తరచూ మా కొడుకు విష్ణుతో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగేవారట. సార్ త్వరలో చేస్తాను అని రాజమౌళి చెప్పగానే కాదు కాదు నాకు పక్కా డేట్ చెప్పండి అంటూ విసిగించే వాడట..

ఇక మోహన్ బాబు మాటలకు విసిగిపోయిన రాజమౌళి నాకు నచ్చితే చేస్తా లేకపోతే లేదు ఇంకోసారి సినిమా అని విసిగించకండి అంటూ వార్నింగ్ ఇచ్చారట.ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మోహన్ బాబు కొడుకు విష్ణు కన్నప్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అన్ని భాషల నుంచి పెద్దపెద్ద స్టార్స్ నటించబోతున్నారట. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.(Mohan Babu)