Heroine: వీల్ చైర్ కే పరిమితమైన స్టార్ హీరోయిన్.. ఇక నడవలేదా.?
Heroine: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ 5 హీరోయిన్లలో రష్మిక మందాన మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈమె స్థానం టాప్ 10 లోనే ఉంటుంది. నేషనల్ క్రష్ గా యువతకు ఎంతో నచ్చిన హీరోయిన్.. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా నటించడమే కాకుండా డాన్సులో కూడా ఇరగదీస్తుంది..
The star Heroine who is confined to a wheelchair
ఏ హీరో పక్కన చేసిన, ఏ క్యారెక్టర్ అయినా సరే తనకు సాటి లేరు అనిపించుకుంటుంది. ఇక ఈమె పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని పుష్ప2తో తన నటనను మరింత చూపించింది.. దీంతో రష్మిక మందనాకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఈ కథానాయిక ప్రస్తుతం వీల్ చైర్ కే పరిమితమైందట.. కనీసం కాలు కింద పెట్టి నడవలేని పరిస్థితికి చేరుకుందట.. మరి కారణమేంటి వివరాలు ఏంటో చూద్దాం.. (Heroine)
Also Read: Monalisa: మోనాలిసాకి బంపర్ ఆఫర్.. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.?
రష్మిక మందన పొద్దున లేవగానే తప్పనిసరిగా జిమ్ లో వ్యాయామం చేస్తుంది.. అలా చేస్తున్న క్రమంలోనే కాలు బెణికి దారుణంగా గాయమైందట. కనీసం నడవలేని పరిస్థితికి వెళ్లిందట. దీంతో ఆమె చేయాల్సిన షూటింగ్ లు ఆగిపోయాయి.. ప్రస్తుతం రెస్ట్ లోనే ఉంది.. అలాంటి ఈమె తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యక్షమై కారు దిగి గెంతుకుంటూ వీల్ చైర్ దగ్గరికి వచ్చిందట. ఆ చైర్ పై కూర్చోగానే సిబ్బంది ముందుకు తోసుకెళ్లారట.
ఈ విధంగా రష్మిక కనీసం కాలు కింద పెట్టలేని పరిస్థితిలో ఉందని ఆమె కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయమైన పడుతుందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన విషయాన్ని కూడా రష్మిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు చెప్పింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.(Heroine)