Pushpa-2: పుష్ప-2 లో అనసూయ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. చేసుంటే వేరే లెవల్..?

Pushpa-2: సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే మాట్లాడుతున్నారు. పుష్ప2 చిత్రం అద్భుతమైన రేంజ్ లో హిట్ అయింది. దీంతో ఈ సినిమాపై జనాలకు మరింత హైప్ పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అయి రెండో రోజు వచ్చినా కానీ థియేటర్లలో తాకిడి మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం పుష్ప సినిమా సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళుతున్న తరుణంలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.
The star heroine who missed the role of Anasuya in Pushpa-2
అయితే ఈ చిత్రానికి ముందుగా ప్రస్తుతం ఉన్న నటినటులు అనుకోలేదట. వేరే నటులను తీసుకోవాలని చివరికి వీళ్లను ఫైనల్ చేశారట. అంతే కాదు పుష్ప సినిమాలో రమ్యకృష్ణ కూడా ఉంటుందని చాలామంది అప్పట్లో అనుకున్నారు. ఈ పాత్రను ఆమె కావాలని రిజెక్ట్ చేసిందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ పుష్ప. (Pushpa-2)
Also Read: Pushpa-2: బాక్సాఫీస్ వద్ద పుష్పగాడి ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాక్..?
ఈ సినిమా మొదటి పార్ట్ అద్భుతమైన హిట్స్ సాధించడంతో, సీక్వెల్ గా రెండో పార్ట్ పుష్పా2 పేరుతో తీసుకొచ్చారు. ఏకంగా 12వేల థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో సినిమా బంపర్ హిట్ అయింది.. అలాంటి పుష్ప సినిమాలో ముందుగా మహేష్ బాబు హీరోగా తీసుకుందాం అనుకున్నారట.

కానీ మహేష్ రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది.. అలా పుష్ప సినిమాలో దాక్షాయని పాత్ర కోసం ముందుగా అనసూయను అనుకోలేదట. రమ్యకృష్ణను పెడదామని భావించారట సుకుమార్. దాని కథ విన్న రమ్యకృష్ణ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని రిజెక్ట్ చేసిందట.. అయితే అనసూయ పాత్రను పుష్ప 1 లో కాస్త చిన్నగా చూపించారు. పుష్ప2 సినిమాలో మాత్రం అద్భుతంగా చూపించారని చెప్పవచ్చు.(Pushpa-2)