Balakrishna: బాలకృష్ణ పై పగ పెంచుకున్న ఇద్దరు కూతుర్లు.. చిన్నప్పటి నుండి అలా చేస్తారంటూ..?
Balakrishna: ఒంటి చేత్తో ట్రైన్ ఆపే శక్తి, తొడగొడితే సుమోలు గాల్లో ఎగిరిపోయే శక్తి ఇండస్ట్రీలో ఏ హీరోకు ఉన్నదయ్యా అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది నందమూరి బాలకృష్ణ మాత్రమే.. ఆయన సినిమాల్లో ఏ విధంగా గంభీరమైన పాత్రల్లో నటిస్తారో నిజ జీవితంలో కూడా అంతే గంభీరంగా ఉంటారు.. ఎప్పుడు చూసినా సీరియస్ గా మాట్లాడే బాలకృష్ణ మనసు మాత్రం వెన్న అని, ఆయనను దగ్గర నుంచి చూసినవారు అంటారు.. అలాంటి బాలకృష్ణ ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు..

The two daughters who harbored a grudge against Balakrishna
ఇప్పటికి ఆరు పదుల వయస్సు దాటినా కానీ కుర్ర హీరోలతో పోటీపడుతూ హిట్లమీద హిట్లు అందుకుంటున్నారు.. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నటువంటి బాలకృష్ణకు మరో శుభవార్త అందింది.. అదే ఆయనకు కేంద్ర ప్రభుత్వం అందించినటు వంటి పద్మభూషణ్ అవార్డు.. బాలకృష్ణ సినిమాల్లో మరియు క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. (Balakrishna)
Also Read: Prabhas: ఆ మ్యాటర్ లో వీకా.. అందుకే ప్రభాస్ పెళ్లికి దూరమా.?
ఇంతటి అవార్డు రావడంతో బాలకృష్ణ చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాదులోని వారి ఫామ్ హౌస్ లో దగ్గరికి కుటుంబ సభ్యులు, కొంతమంది రాజకీయ నాయకుల మధ్య పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో బాలకృష్ణతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పింది.. ఈ క్రమంలోనే తన కూతుర్లు నారా బ్రాహ్మణి, తేజస్విని కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మేము చిన్నతనంలో మా నాన్నను చాలా అపార్థం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆయన ఏ విషయాన్ని అయినా డైరెక్ట్ గా ముఖం ముందే మాట్లాడతారని, మా చిన్నతనంలో ఆయన అలా మాట్లాడటం వల్ల చాలా బాధపడ్డామని ఆయన ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అపార్థం చేసుకున్నామని చెప్పుకొచ్చారు..

కానీ కాస్త మాకు జ్ఞానం వచ్చిన తర్వాత, అలా మాట్లాడింది కూడా మన కోసమే అని, ఆయన ప్రతి మాట వెనుక ఏదో ఒక మంచి అర్థం ఉంటుందని చెప్పుకొచ్చారు. నాన్న లాగా డైరెక్ట్ గా మాట్లాడడం చాలా కష్టం.. ఏ విషయం అయినా డైరెక్ట్ గా చెప్తారు.. లోపల కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకొని మాట్లాడరు అంటూ ఎమోషనల్ అయ్యారు.. ఇక తర్వాత తేజస్విని మాట్లాడుతూ మా నాన్న గ్రాఫ్ పెరగడానికి కారణం నేనే అని చెప్పుకొచ్చింది.. ఆమె అలా సరదాగా అనడంతో స్టేజి మీద ఉన్న వారంతా కాసేపు నవ్వుకున్నారు.. ఈ విధంగా బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను ఆ వేదికగా పంచుకున్నారు.(Balakrishna)