Pokiri Movie: పోకిరి మూవీ ని మిస్ చేసుకున్న దురదృష్టవంతుడు.. చేసి ఉంటే వేరే లెవల్.?
Pokiri Movie: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమా మహేష్ బాబు చేయాల్సింది కాదట. మరి ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది.. అయితే ఈ సినిమా మొదటి చేయాల్సింది మహేష్ బాబు కాదట.

The unlucky person who missed the Pokiri Movie
ఈ సినిమా స్టోరీ ముందుగా పూరి జగన్నాథ్ వేరే హీరో కి చెప్పారట. ఇక ఆ హీరో ఎవరయ్యా అంటే రవితేజ .. పూరి జగన్నాథ్ కి రవితేజ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ ఉద్దేశంతోనే రవితేజని పోకిరి సినిమాలో హీరోగా ఊహించుకొని కథ రాసుకున్నారట. కానీ చివరికి రవితేజ సినిమా చేసే పరిస్థితి లేకపోవడంతో మహేష్ కి స్టోరీ చెప్పడంతో ఈ స్టోరీ నచ్చిన మహేష్ ఓకే చేశారట. (Pokiri Movie)
Also Read: Sreeleela: శ్రీలీల కు పెళ్లి చేసే బాధ్యత ఆ హీరోదేనా.. ఇంతకీ వారి మధ్య ఉన్న బంధం ఏంటంటే..?
అయితే మహేష్ దగ్గరికి స్టోరీ వచ్చిన సమయంలో కొన్ని మార్పులు చేసి సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకి రవితేజతో అనుకున్న సమయంలో సన్నాఫ్ సూర్య, ఉత్తమ్ సింగ్ వంటి టైటిల్స్ ని అనుకున్నారు డైరెక్టర్. కానీ మహేష్ బాబు చేసే సమయంలో పోకిరి గా టైటిల్ మార్చారట. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా కంటే ముందు అయేషా టాకీయా, కంగనా రనౌత్ లని అనుకున్నప్పటికీ వాళ్ళు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఇలియానాని చివర్లో ఫిక్స్ చేశారు.

అలా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రవితేజ చేసి ఉంటే ఆయన కెరియర్ మరింత ఫామ్ లో ఉండేది కావచ్చు అనుకున్నారు అప్పటి మాస్ మహారాజా ఫ్యాన్స్.కానీ రవితేజ బ్యాడ్ లక్ సినిమా రిజెక్ట్ చేశారు మహేష్ బాబు మాత్రం ఈ సినిమా చేసి స్టార్ హీరోగా మారారు.(Pokiri Movie)