Sai Pallavi: సాయి పల్లవి కెరీర్లో పరమ చెత్త రూమర్.. పెళ్లయిన వాడితో మళ్ళీ పెళ్లి..?
Sai Pallavi: సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రతి ఒక్క హీరోయిన్ విషయంలో రూమర్లు రావడం సహజం.అలా సాయి పల్లవి సినీ కెరీర్ లో వినిపించిన పరమ చెత్త రూమర్ ఇదే.. మరి ఇంతకీ సాయి పల్లవి కెరియర్ లో వినిపించిన ఆ రూమర్ ఏంటి..ఎందుకు అంత చెత్త రూమర్ అని అంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రేమమ్ మూవీతో సినిమాల్లోకి వచ్చిన మల్లు బ్యూటీ సాయి పల్లవి తెలుగులోకి ఫిదా సినిమాతో వచ్చి కుర్రాళ్లను ఫిదా చేసింది. ఈ సినిమాతో సాయి పల్లవికి క్రేజ్ మామూలుగా రాలేదు. స్టార్ హీరోలు సైతం ఈ హీరోయిన్ డేట్స్ కోసం వెయిట్ చేసేవారు.
The worst rumor in Sai Pallavi career
కానీ కొంతమంది హీరోలతో సాయిపల్లవి నటించడానికి అస్సలు ఒప్పుకునేది కాదు. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ ఉంటే నటించను అని మొహం మీదే చెబుతుంది. అది ఎంత పెద్ద హీరో మూవీ అయినా సరే..అలాగే రీమేక్ సినిమాల్లో కూడా సాయి పల్లవి నటించడానికి ఒప్పుకోదు. ఇక తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలో చేస్తుంది. లేకపోతే ఎంత రెమ్యూనరేషన్ ఇస్తామన్నా కూడా సినిమా చేయదు. అయితే అలాంటి న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కెరియర్ లో పరమ చెత్త వార్త ఏంటయ్యా అంటే.. పెళ్లయి పిల్లలు ఉన్న తమిళ హీరోతో సాయి పల్లవి డేటింగ్ చేయడం..(Sai Pallavi)
Also Read: Brahmanandam: బ్రహ్మానందం హీరోయిన్లను టార్చర్ చేసేవారా.. షూటింగ్లోనే అలా చేస్తూ.?
అయితే ఇది రూమర్ అయినప్పటికీ సాయి పల్లవి సినీ కెరియర్ పై మాత్రం ఈ రూమర్ చాలా చెత్తగా వినిపించింది. సాయి పల్లవి తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని,ఆయనతో డేటింగ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. అయితే హీరోతో డేటింగ్ చేస్తే ఏంటి.. ప్రతి హీరోయిన్ విషయంలో ఇది వినిపిస్తుందిగా.. అందులో తప్పేముంది అని చాలా మంది అనుకోవచ్చు. కానీ పెళ్లయి పిల్లలున్న హీరోతో సాయి పల్లవి డేటింగ్ చేస్తుందని, ఈమెకు ఇదేం పోయేకాలం, ఆ పెళ్ళై పిల్లలు ఉన్న హీరోతో డేటింగ్ చేయడం ఏంటి అని చాలామంది అప్పట్లో మాట్లాడుకున్నారు.
కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే సాయి పల్లవి పై వినిపించింది రూమర్ మాత్రమే .ఈ విషయంలో సాయి పల్లవి కూడా ఫైర్ అయ్యిందట. ఇలాంటి చెత్త రూమర్లు క్రియేట్ చేయడానికి బుద్ధి లేదా అంటూ.. ఇలాంటి రూమర్లు రాసే వారిపై ఫైర్ అయిందట. అంతేకాదు ఒకరి పర్సనల్ విషయంలో వేలు పెట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా బాధపడిందట. అందుకే ఎన్నో రూమర్లు పర్సనల్ లైఫ్ పై వినిపించగా చివరికి చిర్రెత్తుకొచ్చిన సాయి పల్లవి రీసెంట్ గా ఇప్పటినుండి రూమర్లపై సైలెంట్ గా ఉండేదే లేదు..ఎక్కడివరకైనా వెళ్తా అన్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అలా సాయి పల్లవి సినీ కెరియర్ లో వినిపించిన పరమ చెత్త రూమర్ ఇదే..(Sai Pallavi)