Coconut: పచ్చికొబ్బరి తింటే బోలెడన్ని లాభాలు ?
Coconut: కొబ్బరి ఆరోగ్యానికి ఒక అద్భుతమైన వరమని చెప్పవచ్చు. ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, బలం అందించే పదార్థాలలో కొబ్బరి ముందు వరుసలో ఉంటుంది. పచ్చికొబ్బరి తింటే బోలెడన్ని లాభాలు ఉంటాయి. కాపర్, మాంగనీస్, ఖనిజాలు అధికంగా అందుతాయి. పచ్చి కొబ్బరిని తినడం వల్ల దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు దీనిని తినవచ్చు. కొబ్బరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలో నిలకడగా ఉంటాయి.
There are many benefits of eating raw coconut
కాబట్టి దీనిని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో శక్తివంతమైన ఆక్సిడెంట్లు, కణాలు హానికారక ప్రభావానికి గురికాకుండా చూస్తాయి. అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. కొబ్బరి మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణశక్తి సాఫీగా సాగేలా చేస్తుంది. హృదయ సంబంధ సమస్యలను తగ్గించి రక్తపోటును నియంతిస్తుంది. తెలివితేటలను పెంచుతుంది. కొబ్బరి తినడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది.
Congress: ఎమ్మెల్సీ కోదండరాంకు ఘోర అవమానం.. పేరే మర్చిపోయారు ?
ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, పారాసైటిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే అన్ని రకాల సూక్ష్మజీవులను చంపేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉన్నట్లయితే ఆరోగ్యం ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి కొబ్బరిలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. దానివల్ల అజీర్తి సమస్యలు రావు. కొబ్బరిని తినడం వల్ల చర్మం, ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.