These are the best tips for hair care

Hair: చాలామంది మహిళల్లో జుట్టు పొడవుగా అందంగా కనిపిస్తుంది. కానీ మరికొందరు మహిళల్లో జుట్టు చిన్నగా ఉండి రాలిపోతూ ఉంటుంది. జుట్టు పొడవుగా ఉండాలంటే వీటిని వాడాల్సిందే.? జుట్టును నల్లగా మార్చుకునేందుకు అనేక కంపెనీల హెయిర్ డైలు అందుబాటులో ఉన్నాయి. అయితే జుట్టును ఇంట్లో సహజంగా నల్లగా మార్చే చిట్కాలు ఇవే. గ్రే హెయిర్ ను కవర్ చేయటానికి కాఫీ బాగా పని చేస్తుంది. కాఫీ గింజలు రెండు స్పూన్లు, యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి గంటపాటు జుట్టుకు పట్టించి, స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

ఐదు బ్లాక్ టీ బ్యాగుల్ని తీసుకుని..కొద్దిగా నీటిలో మరిగించండి. చల్లబడిన తర్వాత హెర్బల్ కండిషనర్ కలిపి జుట్టుకు పట్టించండి. ఇలా చేస్తే జుట్టు నిగారిస్తుంది. సహజమైన ముదురు రంగు ఎరుపు రంగు కోసం మందార పువ్వులు, ఆకులు, బంతిపూల రేఖలు వాడితే మార్పు కనిపిస్తుంది. చామంతి టీ, కుంకుమ పువ్వు, సన్ఫ్లవర్ రేకులు, కాండెలిలా..గ్రే హెయిర్ ను కవర్ చేయడానికి మంచి ఉపాయాలు. వీటిని క్రమంగా వాడితే మార్పు కనిపిస్తుంది. బీట్రూట్ జ్యూస్ తాగితే లోపలి నుంచి జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ జ్యూస్ లో క్యారెట్, స్ట్రాబెరీ కూడా కలపవచ్చు.

These are the best tips for hair care

కొబ్బరి నూనె, యాపిల్ సైడర్ వెనిగర్ స్పేను కూడా వాడవచ్చు. జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఉపయోగించే పాపులర్ చిట్కా ఇది. గోరింటాకు పొడికి వెనిగర్ కలిపి రాస్తే ముదురు ఎరుపు రంగు అందుతుంది. తరచూ దీన్ని వాడితే బ్లాక్ రంగులోకి వస్తుంది. తాజా నిమ్మ రసాన్ని జుట్టుకు రాసి దువ్వెనతో దువ్వితే జుట్టు బ్రేక్ అవ్వడాన్ని తగ్గిస్తుంది. నిమ్మరసం జుట్టుకు సహజమైన కాంతి లభిస్తుంది. హెన్నా తరువాత ఇది మరో పాపులర్ చిట్కా. ఇండిగో, ఉసిరి, టీ, నీరు, బీట్రూట్ పొడిని పేస్టులా కలిపి రాస్తే మేలు ముదురు ఎరుపు రంగు వస్తుంది.