Health: ఎండి ద్రాక్ష అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. ఎండు ద్రాక్ష అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ దీనిని తినడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఎండు ద్రాక్షాను ఈ వ్యక్తులు పొరపాటున కూడా తినవద్దు..ఎందుకంటే..ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని తినటం వల్ల శరీరంలోని బలహీనత తొలగిపోవటమే కాదు జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. పరిమితంగా తింటే ఫ్యాట్, కోలెస్ట్రోల్ వంటి సమస్యలు దరి చేరవు. ఎండు ద్రాక్ష నీటిని క్రమం తప్పకుండా తాగితే శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది.
రక్త పరిమాణాన్ని కూడా పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అయితే ఎండు ద్రాక్షాను కొందరు తినకూడదు. శరీరంలో పీచు పదార్థం సరిగ్గా ఉంటే ఎండు ద్రాక్షాను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అధిక ఫైబర్ ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు కారణం అవుతుంది. ద్రాక్షా నుంచి ఎండు ద్రాక్షాను తయారు చేశారు. వీటి సాగులో పురుగు మందులను ఉపయోగిస్తారు. పురుగుమందుల అధిక వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఆర్గానిక్ పుడ్స్ లో పురుగు మందుల వాడకం తక్కువ.
బరువు పెరిగే వారు మాత్రం నిపుణుల సలహా మేరకు ఎండు ద్రాక్ష ను తినాలి. ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది. కనుక తినేటప్పుడు ఎంత తినాలి అనేది గుర్తుంచుకోండి. ఎండు ద్రాక్ష రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఇప్పటికే అధిక లేదా చిక్కగా ఉన్న రక్తం వంటి సమస్యలున్న వ్యక్తులు నిపుణుడితో మాట్లాడిన తరువాత మాత్రమే వాటిని తినాలి. రోజు ఎండు ద్రాక్ష తినాలనుకుంటే కచ్చితంగా దీనితో పాటు ఇతర డ్రై ఫ్రూట్స్ తినండి. ఇలా చేస్తే రెట్టింపు పోషకాహారం లభించడంతోపాటు ఎండు ద్రాక్షాను పరిమితంగా తింటారు. మీరు కూడా ఎండు ద్రాక్షని నేను చెప్పిన పద్ధతిలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తప్పకుండా డైలీ తినండి.