Body smell: చాలామందికి చెమట పట్టేసరికి చర్మం దురవాసన వస్తూ ఉంటుంది. అలా దుర్వాసన వచ్చినప్పుడు చాలామంది సెంట్ వాడుతూ ఉంటారు. మరి కొంతమందికి దుర్వాసన అనేది ఉండదు. శరీరం దుర్వాసన వచ్చే వారికి ఈ ఆహారమే కారణం. మసాలా ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా లవంగాలు, ఇలాచీ, పసుపు, మెంతుల వంటి మసాలాలు చెడు శ్వాసకు కారణం అవుతుంది. వెల్లుల్లి, ఉల్లి నాలుకకు, దవడలకు అతుక్కుపోవటం వల్ల నోటి నుంచి వాసన వస్తుంది. వీటివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
ఈ క్రమంగా చమట ఎక్కువై శరీరం నుంచి వాసన వస్తుంది. మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి నుంచే కాకుండా శరీరం నుంచి కూడా వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ, గోబీ ఎక్కువగా తీసుకున్న ఆ సమస్య వస్తుంది. ఇందులోని సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. ఇది చమట, శ్వాస ద్వారా బయటకు వచ్చేటప్పుడు వాసన వస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే స్నానం చేసేముందు టమాటా రసాన్ని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల దురవాసనని కలిగించే బ్యాక్టీరియా తగ్గుతుంది.
వంట సోడా కూడా చమట వాసనని దూరం చేస్తుంది. ఇందుకోసం ఓ కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. దీనిని అండర్ ఆర్మ్స్ ప్రాంతంలో స్ర్పే చేస్తే ఫలితం ఉంటుంది. విపరీతమైన చమట సమస్యతో బాధపడుతుంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. ఒక కాటన్ లో ముంచి శరీరానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. మీ శరీరం దుర్వాసన రాకుండా ఉండాలంటే పైన చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. సెంట్ వాడకుండా పైన చెప్పిన విధంగా వాడితే దురవాసన అనేది పోతుంది.