Sankrantiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించిన బుడ్డోడి బ్యాక్ గ్రౌండ్ ఇదే..?
Sankrantiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి అందరినీ కడుపుబ్బా నవ్వించే సినిమాతో వచ్చాడని చెప్పవచ్చు. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు వచ్చినటువంటి ఎంతో మంది జనాలకు హీరో వెంకటేష్ “సంక్రాంతి వస్తున్నాం” అనే సినిమా ద్వారా మంచి కామెడీని అందించారు. ఇంటికి వచ్చిన చాలామంది ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు అంటే అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎంత కామెడీతో చేశారో అర్థమవుతుంది.
This is the background of Buddodi who acted in the movie Sankrantiki Vasthunnam
ముఖ్యంగా సంక్రాంతి వస్తుంది అంటే ఆ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ఈ పోటీలో ఈసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ పై చేయి సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అలాంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కేవలం వెంకటేష్ కాకుండా మరో వ్యక్తి వెంకటేష్ ను డామినేట్ చేసే విధంగా కామెడీ చేశారు. మరి ఆ వ్యక్తి ఎవరు? వివరాలు ఇంట్లో చూద్దామా.? వెంకటేష్ కామెడీ చిత్రమంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. (Sankrantiki Vasthunnam)
Also Read: Sankrantiki Vasthunnam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ.. అదే పెద్ద మైనస్..?
ఎఫ్2 సినిమాలో వరుణ్ తేజ్ ను కూడా డామినేట్ చేసే విధంగా వెంకటేష్ కామెడీ చేశారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ను డామినేట్ చేసే విధంగా బుల్లిరాజా అనే వ్యక్తి నటించారు. ఇందులో వెంకటేష్ కొడుకుగా బుల్లి రాజా కామెడీతో అదరగొట్టారు. ఈ బుల్లి రాజు అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ఈ సినిమా ద్వారా ఈ బుడ్డోడు మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టు అనగానే మాస్టర్ భరత్ గుర్తొచ్చేవారు. ఇప్పుడు ఆయన ప్లేసును ఈ రేవంతు భర్తీ చేశాడని చెప్పవచ్చు.
ఈ పిల్లాడితో అనిల్ రావిపూడి అద్భుతమైన కామెడీని క్రియేట్ చేశాడు. చేసేది చిన్నపిల్లాడి పాత్ర అయినా పెద్దవాళ్లు కూడా నవ్వుకునే విధంగా బుల్లి రాజా తన నటనతో అదరగొట్టడని చెప్పవచ్చు. ముఖ్యంగా వెంకటేష్ ఈయన నటన ముందు కాస్త తేలిపోయాడు అంటే బుల్లిరాజా కామెడీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. అంతేకాదు అనిల్ రావిపూడి నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టులకు కూడా బుల్లిరాజాకు ఒక రోల్ ఉంటుందని తెలుస్తోంది.(Sankrantiki Vasthunnam)