Sneha Reddy: అల్లు అర్జున్ పై స్నేహ రెడ్డి ప్రేమకు ఇదే ప్రూఫ్.. 41 రోజులు కఠోర దీక్ష.?
Sneha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది అల్లు రామలింగయ్య.. అలాంటి ఈయన నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. ఈయన వచ్చిన కొత్తలో వీడేంటి హీరోనా వీడి మొఖానికి హీరో అవుతాడా అని ఎంతో మంది వెక్కిరించారు. వాటన్నింటినీ దిగమింగుకొని చివరికి ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్.. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియాలో పుష్పరాజ్ అయిపోయారు.
This is the proof of Sneha Reddy love for Allu Arjun
అలాంటి ఈయన పుష్ప2 సినిమాతో రికార్డును క్రియేట్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయిన సంతోషం అల్లు అర్జున్ ఫ్యామిలీలో ఏమాత్రం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా రిలీజ్ రోజు తోక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. చివరికి ఆయనను అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఇక అప్పటి నుంచి ఈ ఇష్యూ చాలా పెద్దదైపోయింది..(Sneha Reddy)
Also Read: Mokshagna: ప్రశాంత్ వర్మ అవుట్.. మోక్షజ్ఞ కోసం స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపిన బాలయ్య.?
అల్లు అర్జున్ కేసు నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడాలని తన భార్య స్నేహరెడ్డి కఠోర దీక్ష చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదం సందర్భంగా ప్రాయశ్చిత దీక్ష చేశారు. ఆ విధంగానే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన భర్త సంధ్య థియేటర్ ఘటన నుంచి బయటపడాలని 41 రోజులపాటు దీక్ష చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.
కేవలం పండ్లు, పలాలు తింటూనే ఆమె 41 రోజుల పాటు ఉపవాసం ఉంటుందట. దీక్ష విరమణ రోజు ఈమె తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వస్తుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భర్త అంటే స్నేహరెడ్డికి ఎంత ప్రేమ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కెరీర్ లో ఏనాడు ఇలాంటి అపశృతి జరగలేదు. ఇది మొదటిసారి అని చెప్పవచ్చు.(Sneha Reddy)