Thummala Nageswara Rao: తెలంగాణలో రైతుబంధు రద్దు.. తుమ్మల హాట్ కామెంట్స్ ?
Thummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు రద్దు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన.. కామెంట్స్ నేపథ్యంలో… ఈ కొత్త డౌట్ అందరిలోనూ నెలకొంది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఫసలు కు రైతుబంధు వేసేవారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించారు కేసీఆర్. Thummala Nageswara Rao
Thummala Nageswara Rao About Rythu Bandhu
అయితే అది తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత రైతులకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. రైతుబంధు నిధులు.. ఒక్కసారి మాత్రమే వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో కూడా 5 ఎకరాల లోపు వారికి మాత్రమే అందినట్లు సమాచారం. ఇక మొన్న వర్షాకాలం అలాగే యాసంగి పంట రైతుబంధు ఇంకా వేయలేదు కాంగ్రెస్ సర్కార్. Thummala Nageswara Rao
Also Read: Cm Revanth Reddy: కొడంగల్ కు గుడ్ బాయ్.. కొత్త నియోజకవర్గం వేటలో రేవంత్ ?
దీంతో తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు డబ్బులకంటే బోనస్ డబ్బులు… ఎక్కువ వస్తున్నాయని కొంతమంది రైతులు చెబుతున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక రైతుకు 15 వేల రూపాయల వరకు బోనస్ వచ్చే ఛాన్స్ ఉందని… రైతులు వద్దంటే రైతుబంధు కాదని.. కేవలం బోనస్ వేస్తామని కూడా ఆయన ప్రకటించారు. దీంతో త్వరలోనే రైతు బంధు రద్దు కాబోతుందని వార్తలు వస్తున్నాయి. Thummala Nageswara Rao