Tirupati Prakash: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కలిసి తిరిగిన ఈ నటుడు.. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో చూడండి!!
Tirupati Prakash: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ హాస్య నటుడు తిరుపతి ప్రకాష్, ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, గతానికి సంబంధించిన అనుభవాలు, ప్రస్తుత పరిశ్రమలో తలెత్తుతున్న మార్పుల గురించి మాట్లాడారు. 1990లలో తన కామెడీ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన, ఇప్పుడు పరిశ్రమలో అవకాశాలు పొందడం ఎలా కష్టతరమైందో వివరించారు.
Tirupati Prakash Discusses Industry Struggles Today
తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ, “1992లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. 300లకుపైగా సినిమాల్లో నటించా. రోజుకు మూడు షిఫ్టులు చేస్తూ అప్పటి పని వాతావరణం ఎంతో ప్రేరణనిచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దర్శకులను కలవడం, వారి దృష్టిలో పడటం కష్టంగా మారింది. క్యాస్టింగ్ డైరెక్టర్లు కూడా ఫొటోలు తీసుకురమ్మని, అవకాశాలకు ప్రయత్నించాలని చెప్పడం కొన్నిసార్లు మనోభావాలను దెబ్బతీస్తోంది,” అని ప్రస్తుత తన పరిస్థితిని ఆవేదనతో పంచుకున్నారు.
Also Read: Food Safety: హైదరాబాద్ హోటల్స్ లో తింటున్నారా..అయితే చావు ఖాయం!!
తన గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో తనకున్న అనుబంధాన్ని ముచ్చటించారు. “చిరంజీవి గారు మా అందరినీ ఇంటికి పిలిచి స్వయంగా దోశలు చేసి పెట్టేవారు. కొత్తగా తెప్పించిన కేరవాన్ లో మమ్మల్ని ఎక్కించి తీసుకెళ్లేవారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్కూటర్ పై సరదాగా తిరిగిన రోజులు మరువలేని అనుభవాలు,” అని ఆయన సంతోషంతో చెప్పారు. ఆ గోల్డెన్ డేస్ ఇప్పుడు కూడా తనకు ఆత్మీయ స్ఫూర్తిగా నిలుస్తున్నాయని వివరించారు.
ఇటీవలి పరిశ్రమలో మార్పుల గురించి చర్చిస్తూ, “సినిమాల్లో నటించడం ఒకప్పుడు ఎంతో గౌరవప్రదమైన విషయం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీనియర్ నటులు కూడా అవకాశాల కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పాత్రలు వస్తే రావచ్చు, కానీ కనీసం ఆ పాత్రలు గురించి ఒకసారి మాట్లాడే అవకాశం కల్పించాలనే కోరిక ఉంది,” అని తన భావాలను వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రకాష్ ఈ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు, తెలుగు సినీ రంగంలో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తున్నాయి. సీనియర్ కళాకారులు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిశ్రమలో గౌరవప్రదమైన పని వాతావరణం అందించడానికి అవసరమైన మార్పులు పట్ల ప్రజలను, పరిశ్రమను ఆలోచింపజేస్తాయి. ఈ మార్పుల మధ్య, ఆయన వంటి ప్రతిభావంతుల కృషి, అంకితభావం ఆరాధనీయమైనదని చెప్పక తప్పదు.