Drugs: డ్రగ్స్ తీసుకుంటూ ఓయో రూంలో అడ్డంగా బుక్కైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్..?
Drugs: ఈ మధ్యకాలంలో చాలామంది డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. తెలంగాణలో డ్రగ్స్ వ్యాప్తిని ఎంతగా నిర్మూలించాలని చూసినా కూడా ఏదో ఒకచోట డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. అలాగే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో కూడా డ్రగ్స్ వార్తలు వినిపించాయి. అలాగే లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని,సరఫరా చేసిందనే రూమర్స్ కూడా వినిపించాయి.
Tollywood choreographer in OYO room taking Drugs
వీళ్లే కాకుండా బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన మహబూబ్ దిల్ సే, నటి హేమ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో అడ్డంగా ఇరుక్కున్నారు. అయితే తాజాగా ఓ ఫేమస్ కొరియోగ్రాఫర్ కూడా ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. ఇక ఆయన ఎవరు అనేది చూస్తే..ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్ గా చేస్తున్న కన్హా మహంతి తాజాగా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. (Drugs)
Also Read: NTR: నగలతో పారిపోయి వచ్చి ఎన్టీఆర్ తో పెళ్లి..ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా.?
డ్రగ్స్ కేసు మాత్రమే కాదు ఓయో రూంలో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఇక అసలు విషయం ఏమిటంటే.. కన్హా మహంతి ప్రియాంక రెడ్డి అనే సెలబ్రిటీ ఇచ్చే పార్టీకి హాజరయ్యాడు. అయితే ఈ పార్టీ ఓయో రూంలో జరిగింది. ఈ ఓయో రూమ్ లో ప్రియాంక రెడ్డి తో పాటు ఫేమస్ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి కూడా ఉండడం గమనార్హం.
అలాగే ఈ పార్టీలో ఎండిఎంఏ డ్రగ్ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ డ్రగ్స్ బెంగళూరు నుండి సరఫరా చేసినట్టు తెలుస్తోంది.అయితే కన్హా మహాంతికి డ్రగ్స్ ఎవరు అమ్మారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు కన్హా మహంతిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ మీడియాలో వైరల్ గా మారింది.(Drugs)