Ambani Marriage: అంబానీ ఇంట్లో పెళ్ళికి మరో టాలీవుడ్ హీరో.. ఇదిగో ప్రూఫ్!అంబానీ ఇంట్లో జరిగే పెళ్లి అంటే మాటలా.. ప్రపంచం అంతా మాట్లాడుకోవాల్సిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మాస్యూటికల్ దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ఈరోజు (జూలై 12) తమ వివాహాన్ని జరుపుకోనున్నారు. శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. ఈ వేడుకకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అతిథులుగా హాజరుకానున్నారు.
Tollywood Heroes to Ambani Marriage
హలీవుడ్ స్టార్స్ కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ ముంబయికి ఇప్పటికే చేరుకోగా, చాలా మంది పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కారా బీడెట్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షుడు సమీ సులుహు హా సాంగ్తో పాటు పలువురు ప్రముఖులు కూడా రానున్నట్లు సమాచారం.
అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరో మాత్రమే హాజరవుతారని వార్తలు రాగా ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ పెళ్ళికి బయలుదేరారట. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కూతురు క్లింకరతో కలిసి గురువారం ముంబై చేరుకున్నారు. అయితే ఈరోజు ఉదయం మహేష్ బాబు ఆయన కుటుంబసభ్యులతో కలిసి విమానాశ్రయంలో కనిపించారు.
ఈరోజు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహ వేడుకలో రామ్ చరణ్ దంపతులతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం ఆయన తన భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి విమానాశ్రయంలో కనిపించారు. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా మహేష్ విదేశాల్లో ఉన్నాడు. కుటుంబ సమేతంగా లండన్, జర్మనీలకు సెలవుపై వెళ్లిన మహేష్ రెండు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి. తాజాగా అనంత్ అంబానీ పెళ్లికి హాజరు కాబోతున్న మహేష్ తన కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుర్తుతెలియని పొడవాటి జుట్టు, గడ్డంతో మహేష్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు.
Superstar @UrstrulyMahesh sets off to Mumbai to attend the Grand Wedding of Ananth Ambani #MaheshBabu #SSMB pic.twitter.com/cPmPxTLrjL
— Mahesh Babu Space (@SSMBSpace) July 12, 2024