Heroine: భర్తకు విడాకులు ఇవ్వబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. నిజమేనా..?


Tollywood Heroine is going to divorce her husband

Heroine: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, పిల్లలు, విడాకులు అనే ట్రెండు కొనసాగుతోంది.. భారతీయ సంస్కృతిని విడమరిచి, చాలామంది సినీ హీరోలు, హీరోయిన్లు చిన్నచిన్న మనస్పర్ధలకే విడాకుల బాటపడుతున్నారు.. ఇప్పటికే సమంత, నాగచైతన్య విడిపోయి సంచలనం సృష్టించిన తరుణంలో వారి వెంటే మేము కూడా వస్తున్నామని పలు సినీ జంటలు అంటున్నారు.. అయితే ఇదే విడాకుల బాటలోకి మరో స్టార్ హీరోయిన్ కూడా రాబోతుందట.

Tollywood Heroine is going to divorce her husband

ఆమెకు పెళ్లయి పిల్లలు కూడా పుట్టారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా విడాకుల బాట పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు లీక్ అయ్యాయి.. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే కాజల్ అగర్వాల్.. చందమామ అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ గా ఎదిగింది. (Heroine)

Also Read: Heroine: తమిళ హీరోతో బ్రేకప్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. ఫొటోస్ వైరల్.?

పలు పాన్ ఇండియా చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఈమె బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ కిచ్చుల్ ను 2020లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు.. అయితే పిల్లలు పుట్టాక కూడా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతున్న తరుణంలో తాజాగా విడాకులు తీసుకోబోతుందని ఒక రూమర్ బయట వినిపిస్తోంది. దీనికి కారణం కాజల్ ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళుతుంది.

Tollywood Heroine is going to divorce her husband

ముఖ్యంగా ఏదైనా వేకేశన్స్ వెళితే భర్తతో కలిసి వెళ్తారు. కానీ కాజల్ భర్తకు దూరంగా ఒక్కతే వెళ్లడం వల్ల పలువురికి అనుమానం కలుగుతుంది. దీంతో కాజల్ గౌతమ్ మధ్య ఏదైనా గొడవ జరిగిందా, అందుకే వీరిద్దరూ కాస్త దూరం దూరంగా ఉంటున్నారా అంటూ నేటిజన్స్ అనుమాన పడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే కాజల్ మీడియా ముందుకు వచ్చి స్పందిస్తే కానీ అర్థం కాదు.(Heroine)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *