Heroine: వాలంటైన్స్ డే రోజు ఆ హీరోతో దుబాయ్ కి చెక్కేసిన టాలీవుడ్ హీరోయిన్..?
Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుతో దూసుకుపోతూ ఇప్పటికి రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వస్తున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు.. ఇందులో ఆ స్టార్ హీరోయిన్ మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో కూడా సినిమాల్లో చేసి తనకు ఎదురు లేదు అనిపించుకుంటుంది. కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్నా కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బాలీవుడ్ ఫేమస్ నటుడితో ప్రేమలో ఉండి ఎంజాయ్ చేస్తోంది.

Tollywood Heroine who went to Dubai with that hero on Valentines Day
అయితే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె ఆ వ్యక్తితో కలిసి ఎంజాయ్ చేయడానికి దుబాయ్ కూడా వెళ్లిందట. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఇద్దరు సీక్రెట్ గా కలిసి ఉన్నారట.. ఇంతకీ ఈ ప్రేమ జంట ఎవరయ్యా అంటే టాలీవుడ్ స్టార్ మిల్కీ బ్యూటీ తమన్న. ఈమె చాలా ఏళ్లుగా విజయ్ వర్మతో లవ్ లో ఉన్న విషయం అందరికీ తెలుసు.. (Heroine)
Also Read: Director: పెళ్లికి తాళిబొట్టు కొనలేని దీన స్థితిలో స్టార్ డైరెక్టర్.?
వీరిద్దరూ కలిసి వేకేషన్స్ తిరుగుతూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.. అంతేకాదు త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నామని చెబుతున్నారు.. అలాంటి ఈ జంట పెళ్లి తర్వాత కలిసి ఉండేందుకు ఇప్పటికే ముంబైలోని ఫేమస్ ప్రాంతమైనటువంటి బాంద్రాలో ఒక ఖరీదు అయినటువంటి ఫ్లాట్ కూడా కొన్నారట. తర్వాత వీరు అక్కడే నివసిస్తారని తెలుస్తోంది..

అలాంటి ఈ జంట ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేయడం కోసం దుబాయ్ కి వెళ్లి అక్కడ ఖరీదైన ఫ్లాట్ లో సెలబ్రేషన్స్ చేసుకొని దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు.. దీంతో తమన్నా విజయ్ వర్మ అభిమానులు ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతూ, పెళ్లెప్పుడు చేసుకుంటారంటూ అడుగుతున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.(Heroine)