Dry Fruits: ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వారు హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం, జ్యూస్ లు, ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. చాలామంది డ్రై ఫ్రూట్స్ ఇష్టంగా తింటారు. కొంతమంది మాత్రం డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడని వారు నానబెట్టుకుని తింటూ ఉంటారు. అయితే ఇలా నానబెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని బయటకు చెబుతున్నారు. Dry Fruits
Top Health Benefits of Consuming Dry Fruits
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే పోలిక్ ఆసిడ్ తొలగిపోయి ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం, మినరల్స్ శరీరానికి అందుతాయి. ముఖ్యంగా వీటిని నానబెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు సులభంగా తొలగిపోతాయి. డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తినడం వల్ల జుట్టు బలంగా, ఒత్తుగా తయారవుతుంది. ఇందులో ఐరన్ ఉండడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. Dry Fruits
Also Read: Team India: టీమిండియాకు WTC టెన్షన్.. ఫైనల్ కు వెళ్లాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి ?
డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్, ప్రోటీన్ ఉండడం వల్ల అసలు ఆకలి వేయదు. చాలా సేపు ఆకలి అనిపించదు. కడుపు నిండుగా ఉంటుంది. దానివల్ల తక్కువగా తింటారు. సులభంగా బరువు తగ్గుతారు. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే ప్రోటీన్స్, పొటాషియం వంటివి అందుతాయి. దానివల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డైట్ ఫాలో అయ్యేవారు తప్పకుండా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తింటారు. దానివల్ల వారు సులభంగా బరువు తగ్గుతారు. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. దానివల్ల కడుపులోని శిశువుకు కావాల్సినన్ని ప్రోటీన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. వారి మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది. Dry Fruits