Trisha: ప్రేమ గెలుస్తుంది అంటూ పెళ్లికి రెడీ అయిన త్రిష.. ఫోటో వైరల్..?

Trisha: స్టార్ హీరోయిన్ త్రిష తన ప్రేమ పెళ్లి వార్తలతో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా అందరికీ అనుమానాలు పుట్టిస్తూ ఓ ఫోటో షేర్ చేసి త్రిష ఏమైనా పెళ్లి చేసుకోబోతుందా అని అందరికీ అనుమానం కలిగేలా ఒక పోస్ట్ చేసింది.మరి ఇంతకీ త్రిష చేసిన ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Trisha is ready for marriage
సీనియర్ నటి త్రిష 40+ ఏజ్ వచ్చినా కూడా ఇంకా నో పెళ్లి అంటూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే చాలా రోజుల నుండి ఈ హీరోయిన్ విజయ్ దళపతితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లియో సినిమా టైమ్ నుండి మళ్ళీ వీరి మధ్య ప్రేమ చిగురించిందని, అందుకే విజయ్ భార్యని దూరం పెట్టారనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. (Trisha)
Also Read: Sreeleela: లవ్ కన్ఫామ్ చేసిన శ్రీలీల.. నువ్వే నా ప్రపంచం అంటూ పోస్ట్.?
ఇక రీసెంట్గా వేణు స్వామి కూడా తమిళంలో హీరో నుండి రాజకీయాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తి త్వరలోనే తన భార్యకు విడాకులు ఇచ్చి ఓ సినీ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం ఖాయం అంటూ త్రిష విజయ్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో వీరిద్దరి ప్రేమ పెళ్లి వార్తలు తమిళ్ మీడియాల చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజాగా త్రిష సాంప్రదాయ బద్ధంగా చీర కట్టుకొని నగలు పెట్టుకొని ఎంగేజ్మెంట్ కి ఎలా అయితే రెడీ అవుతారో అలా రెడీ అయ్యి లవ్ ఆల్వేస్ విన్స్ అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ ఫోటో కింద ఈ క్యాప్షన్ పెట్టడంతో త్రిష ఏమైనా పెళ్లి చేసుకోబోతుందా.. లేక కొత్త సినిమా ప్రమోషనా అంటూ చాలామంది నెటిజన్లు అనుమానపడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ త్రిష పెట్టిన పోస్ట్ మాత్రం నెట్టింట పలు ఊహాగాణాలకు దారి తీసింది.(Trisha)