Trisha: సీఎం అవ్వాలంటున్న త్రిష.. మామూలు ట్రిస్ట్ ఇవ్వలేదుగా.?
Trisha: హీరోయిన్ త్రిష.. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాదిలో తనకంటూ సపరేటు గుర్తింపు సాధించుకుంది. ఇప్పటికీ నాలుగు పదుల వయస్సు దాటుతున్న పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఇలాంటి ముదురు ముద్దుగుమ్మ సినిమాల్లో మాత్రం ఎదురులేని కథానాయికగా దూసుకుపోతోంది. అలాంటి త్రిష తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నో సినిమాల్లో నటించి బాగా ఆస్తులు కూడబెట్టిన త్రిష ప్రజాసేవ చేయాలనుకుంటుందట.
Trisha wants to become CM
అంతేకాదు ఆమె ఒక రాష్ట్రానికి సీఎం కూడా కావాలని అనుకుంటుందట. మరి త్రిష కోరిక నెరవేరుతుందా.. ఆమె ఏ పార్టీ ద్వారా సీఎం అవ్వాలనుకుంటుంది అనే వివరాలు చూద్దాం.. చాలామంది సినీ నటులు సినిమాల్లో బాగా సంపాదించి ప్రజాసేవకై రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. కొంతమంది పార్టీలు పెట్టి సక్సెస్ అయితే మరి కొంతమంది వివిధ పార్టీలోకి వెళ్లి సక్సెస్ అవుతున్నారు. అలా త్రిష కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఒక బలమైన కోరిక ఉందని అన్నది. (Trisha)
Also Read: Chiranjeevi: డైరెక్టర్ తో చిరంజీవి గొడవ.. “విశ్వంభర” సినిమాకి ఆటంకాలు.?
అదే నేను తమిళనాడు సీఎం కావాలి అని చెప్పేసింది.. ఈ సమాజంలో మార్పులు వచ్చి పేదరికం రూపుమాపాలి అంటే సినిమాల ద్వారా కాదని ప్రజాసేవ చేసి రాజకీయాల్లోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలియజేసింది. అంతేకాదు తను ముఖ్యమంత్రి కావాలనేది బలమైన కోరిక అని త్రిష చెప్పడంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది హార్ట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా త్రిష కు ఎంతో సన్నిహితంగా ఉండే విజయ్ దళపతి కూడా పార్టీ స్థాపించడం ఈ క్రమంలోనే త్రిష నేను సీఎం అవ్వాలని కోరుకోవడం చూస్తే మాత్రం వీరి మధ్య ఏదో లింకు ఉందని చాలామంది అనుకుంటున్నారు.
ఒకవేళ విజయ్ చలపతి పెట్టిన పార్టీ వచ్చే ఎలక్షన్స్ లో సక్సెస్ అయిపోయి తమిళనాడులో లీడింగ్ లోకి వస్తే మాత్రం సీఎం పదవి త్రిష కి ఇస్తారు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా త్రిష అన్న మాటలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి అని చెప్పవచ్చు. మరి చూడాలి త్రిష మాటలు నిజం చేసుకుంటుందా లేదంటే ఊరికే అలా మాట్లాడిందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Trisha)