Allu Arjun: అల్లు అర్జున్ తో కొత్త ప్రయోగం.. త్రివిక్రమ్ మూవీలో అఘోరాగా.. 1000 కోట్లు పక్కా..?
Allu Arjun: ఒక్క సినిమా చాలు జీవితాన్ని మార్చేస్తుందని అంటుంటారు. అలా అల్లు అర్జున్ రేంజ్ ని ఆకాశానికి ఎత్తిన మూవీ పుష్ప.. అలాంటి ఈ చిత్రం రెండు పార్ట్ లుగా వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.. కేవలం అల్లు అర్జున్ కే కాకుండా డైరెక్టర్ సుకుమార్ కు ఇతర నటీనటులకు మంచి పేరు తీసుకువచ్చింది. అలాంటి పుష్ప2 సినిమా రిలీజ్ అయి 2000 కోట్లకు దగ్గరకు వచ్చింది.. అలాంటి ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై చాలామందికి ఆసక్తి నెలకొని ఉంది.
Trivikram new experiment with Allu Arjun 1000 crores sure
ఇదే తరుణంలో ఆయన మరో పాన్ ఇండియా చిత్రం త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్నారట.. ఇందులో అల్లు అర్జున్ పాత్ర చాలా వెరైటీగా ఉంటుందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ ఆయనను ఏ విధంగా చూపించబోతున్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఇక రాబోయే నాలుగో సినిమా మైథాలజీ జానారులో సుబ్రహ్మణ్యస్వామి జీవిత చరిత్రని ఆధారంగా చేసుకుని తెరకేక్కిస్తారట. ఇందులో అల్లు అర్జున్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. (Allu Arjun)
Also Read: Nagarjuna: నయనతార మాజీ లవర్ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్.!
ముఖ్యంగా మైథాలజీ సినిమాలపై త్రివిక్రమ్ కు చాలా పట్టుంది. ఆ విధమైన టాలెంట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట.. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న అల్లు అర్జునును ఈ మైథాలజీ సినిమా ద్వారా మళ్ళీ అదే రేంజ్ లో చూపించేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారట.. అంతేకాదు ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఇప్పటికే పూర్తి చేశారని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని ఇంకా రెండు మూడు నెలల్లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టి సినిమా తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట..
ఒకవేళ అన్నీ అనుకున్నట్టు సినిమా స్పీడ్ గా ముందుకు వెళ్తే మాత్రం అల్లు అర్జున్ అభిమానులకు అంతకుమించి ఆనందం ఏమీ ఉండదు. ఇక ఆయన పుష్ప2 సినిమా 2000 కోట్ల రూపాయల మార్క్ ని దాటడానికి దగ్గరగా వచ్చింది. ఒకవేళ మార్కు దాటితే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో పుష్ప2 సినిమా రికార్డులు క్రియేట్ చేసినట్టే.. ఇక అల్లు అర్జున్ ఎలాంటి పాత్రలో అయినా నటించడం కాదు జీవించేస్తారు.. ఇక అలాంటి అల్లు అర్జున్ అఘోర పాత్రలో అదరగొట్టేస్తారని ఆయన అభిమానులు నమ్ముతున్నారు.(Allu Arjun)