Chiranjeevi: ఆయనో ఎర్రి మొహం.. చిరంజీవి పై ట్రోల్స్..?
Chiranjeevi: ఎవరి పేరు చెబితే ఏడ్చేవాళ్ళు కూడా నవ్వుతారో, ఎవరి కటౌట్ చూస్తే ఎంత బాధలో ఉన్న స్మైలింగ్ ఫేస్ పెడతారో, ఎవరి కామెడీ చూస్తే నవ్వి నవ్వి కడుపు ఉబ్బుతుందో ఆయనే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. ఇన్నాళ్లు మనల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ బ్రహ్మనందం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తప్ప ఇతర పాత్రలు చేయలేదు.. తాజాగా ఈయన పూర్తిస్థాయి నిడివితో ఒక సినిమా రాబోతోంది.. ఆ సినిమా పేరు “బ్రహ్మ ఆనందం” వాలెంటెన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో తన కొడుకు రాజా గౌతమ్ కీలక పాత్ర చేస్తున్నారట.

Trolls on Chiranjeevi
అయితే ఇందులో ఈ తండ్రి కొడుకులు తాతా మనవళ్లుగా నటించబోతున్నారట.. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా పెద్ద ఎత్తున నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఒక బూతు పదాన్ని తన నోటి నుంచి జారవిడిచాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు.. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.. (Chiranjeevi)
Also Read: Nagarjuna: దానివల్ల చైతూ టార్చర్ అనుభవించాడు.. నాగార్జున మాటలకి కన్నీళ్లు పెట్టిన శోభిత.?
చిరంజీవి బ్రహ్మానందంని చూడగానే నవ్వుతూ చాలా హుషారుగా మాట్లాడారు.. బ్రహ్మానందం కేవలం సినిమాల్లో నవ్వించడమే కాకుండా, తన మీమ్స్ సోషల్ మీడియాలో ప్రతిక్షణం నవ్విస్తూనే ఉంటాయని చెప్పుకొచ్చారు.. ఆయన మీమ్స్ గురించి మరో మాట మాట్లాడుతూ నోరు జారాడు.. బ్రహ్మానందం “రెడ్ పేస్.. ఎర్రి మొహం పెడతారు కదా ఎర్రి” అంటూ ఒక మాట అన్నారు. ఈ మాటలు విన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్, బ్రహ్మానందం, గౌతమ్ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది చిరంజీవిని తిడుతున్నారు..

అంత పెద్ద స్టార్ ను ఎర్రి అంటావా అంటూ కామెంట్స్ తో దిబ్బి పొడుస్తున్నారు.. చిరంజీవిని ఎంతటి పొజిషన్ లో ఉంటే ఏంటి సరిగ్గా మాట్లాడడం రాకపోతే ఆ పొజిషన్ కు వ్యాల్యూ ఉండదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అనుకోకుండా సరదాగా మాట్లాడారు తప్ప ఆయనను కావాలని అనలేదని చిరంజీవికి సపోర్ట్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఈ వార్త నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాను ఆర్విఎస్ నిఖిల్ డైరెక్షన్ చేస్తున్నారట. ఇందులో కీలక పాత్రలో రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు, నటిస్తున్నారట.(Chiranjeevi)