Nagarjuna: శోభిత జుట్టు పట్టుకుని అలా చేసినా నాగ్.. మొగుడివి నువ్వేనా అంటూ నాగార్జున పై ట్రోల్స్.?
Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇండస్ట్రీలో హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. ఇక నాగచైతన్య మొదటగా సమంతను పెళ్లి చేసుకుని విడాకుల ద్వారా విడిపోయారు. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టి దూసుకుపోతున్న తరుణంలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు.

Trolls on Nagarjuna
చివరికి ఈ ప్రేమను ఇరు కుటుంబాలకు చెప్పి డిసెంబర్ 4వ తేదీన వివాహం ద్వారా ఒక్కటయ్యారు. వీరి పెళ్లి తర్వాత దేవాలయాలను సందర్శిస్తూ పూజలు చేస్తున్నారు. తాజాగా నాగార్జునతో నాగచైతన్య, శోభితా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.. ఈ టైంలో శోభిత ధూళిపాళ్ల గోల్డ్ కలర్ చీరలో నాగచైతన్య వైట్ కలర్ కుర్తాలో చూడముచ్చటగా కనిపించారు. (Nagarjuna)
Also Read: Jayasudha: సీక్రెట్ గా మూడో పెళ్లి చేసుకున్న జయసుధ విదేశాల్లో ఎంజాయ్.?
అయితే ఈ గుడికి వెళ్ళిన తరుణంలో పూజారి వీళ్ళకు గంధం బొట్టు పెట్టే సందర్భంలో ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో పై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో నాగార్జునను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గంధం బొట్టు పెడుతున్న సమయంలో శోభిత జుట్టు కాస్త ముందుకు ఉంది. దీంతో ఆమె జుట్టూ వెనక్కి జరుపుకుంది.

పక్కనే ఉన్న నాగార్జున ఆమె జుట్టు పట్టుకొని వెనక్కి కాస్త జరిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శోభితకు మొగుడు నాగార్జుననా లేకపోతే నాగచైతన్యనా అంటూ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఆకతాయిలు. మరికొంతమంది మామయ్య అంటే తండ్రి లాంటి వ్యక్తి, సొంత కోడలికి అలా చేస్తే తప్పేముంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన మాత్రం నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతుంది.(Nagarjuna)