Vijayashanthi: పవన్ భార్యపై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్!
Vijayashanthi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా పైన దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో గుండు తీయించుకున్నారని ఆమెపై సెటైర్లు పేల్చుతున్నారు కొంతమంది. క్రిస్టియన్ అయి ఉండి… హిందూ సాంప్రదాయ పద్ధతిలో గుండు తీసుకుందని సెటైర్లు పెంచుతున్నారు. అయితే ఇలా పవన్ కళ్యాణ్ భార్య పైన ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ విజయశాంతి స్పందించారు.

Trolls on Pawan’s wife Vijayashanti fires
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నాను ట్రోలింగ్ చేయడం అత్యంత దారుణం అంటూ మండిపడ్డారు. కొంచెం అయినా మీకు బుద్ధి ఉందా అని నిలదీశారు. ఒక మహిళ తలనీలాలు సమర్పిస్తే ట్రోలింగ్ చేస్తారా ? ఇదెక్కడి పద్ధతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాములమ్మ. తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడని ఆమె తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుందని గుర్తు చేశారు.
Drinking Warm Water: వేసవి కాలంలో వేడి నీళ్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త !
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాకు అందరూ తోడుగా ఉండాలని కోరారు. కానీ అందరూ కలిసి ఆమెపై సెటైర్లు పేల్చడం అత్యంత దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా… ఇటీవల సింగపూర్లో పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం శంకర్ ఆరోగ్యం కుదుటుగా ఉండటంతో ఆమె మొక్కులు చెల్లించుకునేందుకు… తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చారు.
NTR slim look: ఎన్టీఆర్ ని హింసిస్తున్న దర్శకులు.. ఏం ట్రాన్సఫర్ మేషన్ సామీ!!