BR Naidu: మీనాక్షి చౌదరీని ఫాలో అవుతున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు?
BR Naidu: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ట్విటర్‌లో మీనాక్షి చౌదరీని ఫాలో అవుతున్నాడు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. దీనికి సంబంధించిన విషయం వైరల్ గా మారింది. ఫాలోయింగ్ జాబితాలో అందరికన్నా ముందు హీరోయిన్ ప్రొఫైల్ ఉందని ప్రచారం చేస్తున్నారు.
TTD Chairman BR Naidu is following Meenakshi Chaudhary
దీంతో.. ఈ వయసులో హీరోయిన్లు అవసరమా తాత? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరీ పై ఉన్న శ్రద్ధ.. తిరుమల వెంకటేశ్వరునిపై ఉండి ఉంటే.. ఆ తొక్కిసలాట ఘటన జరిగి ఉండేది కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇక అటు చంద్రబాబు ఎదుటే… బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మధ్య పంచాయతీ తెరపైకి వచ్చిందట. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం ఆరా తీస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని ప్రచారం జరుగుతోంది.
Also Read: Mohan Babu: మోహన్ బాబు ఆస్తుల వివాదం.. కీలక తీర్పునిచ్చిన కోర్టు!!
సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని టీటీడీ ఈవో శ్యామల రావుపై చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. తను సొంత నిర్ణయాలు ఏం తీసుకుంటున్నానో చెప్పాలని శ్యామలరావు ధ్వజం ఎత్తారట. ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో జోక్యం చేసుకున్నారట చంద్రబాబు. ఇద్దరూ సమన్వయంతో పని చేయడం రాదా? ఇదేం పద్ధతి అంటూ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.