Turmeric Milk: పాలు ఎప్పుడు తాగాలి,పసుపు పాలు రాత్రి తాగడం మంచిదా ?
Turmeric Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ముఖ్యంగా పసుపు కలిపిన పాలు తాగడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పసుపు కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే చాలామంది పసుపు పాలు తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ పసుపు పాలకు కొంతమంది మాత్రం తప్పకుండా దూరంగా ఉండాలి.
Turmeric Milk health benefits
లేదంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పసుపు కలిపిన పాలు ఎవరూ తాగకూడదు తెలుసుకుందాం… స్కిన్ ఎలర్జీ ఉన్నవారు పసుపు పాలను తాగకూడదు. స్కిన్ ఎలర్జీ ఉన్నవారు పసుపు పాలు తాగితే స్కిన్ ఎలర్జీ మరింత ఎక్కువగా అవుతుంది. అలాగే కొంతమందికి కడుపునొప్పి వస్తూ ఉంటుంది.
అలాంటివారు పసుపు పాలను తాగకూడదు. వికారం, వాంతులు, వీరేచనాల సమస్యలతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు పాలను తాగకూడదు. ఇవే కాకుండా పిత్తదోషం సమస్యతో బాధపడే వారు ఉంటారు. అలాంటి వారు కూడా పసుపు పాలకూ దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.