Balakrishna: బాలకృష్ణతో కొట్టించుకోవడానికి ఒప్పుకోని ఇద్దరు హీరోయిన్లు.. అందుకే హాట్ బ్యూటీ.?
Balakrishna: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు సినిమా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. హీరో, హీరోయిన్లు, దర్శకులు సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడం మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో వీరితో పాటుగా నిర్మాతలు కూడా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు.. సినిమాకు సంబంధించిన విషయాలను ఓపెన్ గా చెబుతూ మరింత క్రేజ్ పెంచుతున్నారు.
Two heroines who did not agree to be beaten by Balakrishna
అయితే తాజాగా సూర్యదేవర నాగవంశీ కూడా బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకు మహారాజ్ సినిమా నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగవంశీ. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా డిఫరెంట్ గా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా డాకూ మహారాజ్ సినిమాలో దబిడ దిబిడ సాంగ్ ట్రోల్స్ కి గురైన విషయం అందరికీ తెలిసిందే.. (Balakrishna)
Also Read: Sreeleela: సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో శ్రీలీల ఎఫైర్.. పబ్లిక్ గా ఆ పని చేస్తూ మీడియాకి దొరికి?
ఇందులో బాలకృష్ణ డాన్స్ చేస్తూ ఊర్వశీ బ్యాక్ పై కొట్టడం చాలామందికి నచ్చలేదు. ఈ స్టెప్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవేమీ స్టెప్స్ అంటూ శేఖర్ మాస్టర్ ను ట్రోల్ చేశారు. ఈ స్టెప్స్ కు సంబంధించిన ప్రశ్నలే అడిగారు రిపోర్టర్స్.. దబిడ దిబిడే సాంగ్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ కు ఇంట్రెస్టా..మీ ఇంట్రెస్టా అని ప్రశ్నించగా.. ఊర్వశిని కొట్టింది నేను కాదు కదా బాలయ్య గారు..
నేను కొడితే నా ఇంట్రెస్ట్ ఆయన కొడితే ఆయన ఇంట్రెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు.. మరి ఈ చిత్రంలో ప్రగ్యా, శ్రద్ధ శ్రీనాథ్ ఉండగా ఊర్వశిని ఎందుకు తీసుకున్నారని అడగగా ఆ ఇద్దరు హీరోయిన్లు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు అందుకే ఊర్వశీని తీసుకోవాల్సి వచ్చింది అంటూ సమాధానం ఇచ్చాడు.(Balakrishna)