Keerthy Suresh:కీర్తి సురేష్ రెండు పెళ్లిళ్లు.. వెలుగులోకి షాకింగ్ నిజం..?
Keerthy Suresh: కీర్తి సురేష్ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న హీరోయిన్.. అలాంటి ఈమె త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకొని ఆయనకు భార్యగా వెళ్లనుంది. అయితే వీరి వివాహం గోవాలో దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇదే తరుణంలో ఈమె పెళ్లి రెండుసార్లు జరగబోతుందని కొన్ని వార్తలు ఊపందుకున్నాయి..
Two marriages of Keerthy Suresh Shocking truth
పెళ్లి రెండు సార్లు ఎందుకు జరుగుతుంది ఒకేసారి కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ కీర్తి సురేష్ పెళ్లి ఒకేరోజు రెండు సార్లు జరుగుతుందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఈ డిసెంబర్ లో గోవాలో జరగబోయే గ్రాండ్ ఈవెంట్ లో ఈ జంట ఒక్కటి కాబోతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 10 నుంచి 12 తేదీల్లో వీరి పెళ్లి ఆచారం ప్రకారం జరగబోతుందట. (Keerthy Suresh)
Also Read: Drugs: డ్రగ్స్ తీసుకుంటూ ఓయో రూంలో అడ్డంగా బుక్కైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్..?
ఇటు కీర్తి సురేష్ ఫ్యామిలీ ఆచారం ప్రకారం, మరోవైపు తట్టిల్ ఆచారం ప్రకారం రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకోబోతున్నారట. డిసెంబర్ 12న కీర్తి ఆంటోనీ తట్టిల్ ను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుందట. దానికోసం సాంప్రదాయమైనటువంటి చీరను కూడా ఆమె ఇప్పటికే సెలెక్ట్ చేసుకుందని సమాచారం. ఇదే క్రమంలో ఆరోజు సాయంత్రం చర్చిలో ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
వీరి వివాహ వేడుక డిసెంబర్ 10 డిసెంబర్ 12న ముగుస్తుందట. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు దగ్గర కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, సినీ రాజకీయ ప్రముఖులు, కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా గత 15 సంవత్సరాల నుంచి వీరు ప్రేమలో ఉన్నారు. చివరికి పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతుండడంతో కీర్తి సురేష్ అభిమానులు సంబరపడిపోతున్నారు.(Keerthy Suresh)