Game Changer: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి వచ్చి చనిపోయిన ఇద్దరు యువకులు.. రామ్ చరణ్ పై కేసు వేస్తారా..?
Game Changer: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోల మీద అభిమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా రీసెంట్గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అల్లు అర్జున్ పుష్ప టు విడుదల సమయంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆ మహిళ కొడుకు చావు బతుకుల మధ్య ఉండడం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందొ చెప్పనుక్కర్లేదు.అయితే ఈ ఘటన మరువక ముందే గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి వచ్చిన యువకులు ఇద్దరు మరణించారు.మరి ఇంతకీ ఏం జరిగింది అనేది చూస్తే..
Two youths who came to the Game Changer event and died
రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న విడుదల కాబోతుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్.అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ఇక ఇద్దరు మెగా హీరోలను ఒకే స్టేజిపై చూడడానికి ఎంతో మంది మెగా ఫ్యాన్స్ అక్కడికి తరలివచ్చారు. అలా మెగా ఫ్యామిలీకి చిన్నప్పటినుండి వీరాభిమానులు అయిన గైగోలుకు చెందిన మణికంఠ, చరణ్ లు గేమ్ చేంజర్ ఈవెంట్ చూడడానికి వచ్చారట.(Game Changer)
Also Read: Anantha Sriram: కల్కి సినిమాపై మండిపడ్డ అనంత శ్రీరామ్.. ఇది ఓ సినిమానేనా.?
అయితే ఈవెంట్ చూస్తున్నంత సేపు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈవెంట్ అయిపోయాక తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లే సమయంలో వ్యాన్ ఢీ కొని బైక్ మీద వెళుతున్న చరణ్ మణికంఠలు కిందపడి తీవ్రంగా రక్తం పోయిందట. అయితే చావు బతుకుల మధ్య పోరాడుతున్న వీరిని అక్కడున్న వాళ్లు హాస్పిటల్ కి తీసుకు వెళ్లే లోపే మరణించారు. దాంతో వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ విషయం తెలిసి గేమ్ ఛేంజర్ యూనిట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.అలాగే ఈ విషయం మెగా ఫ్యామిలీకి కూడా తెలిసి వాళ్ళు కూడా బాధపడ్డారట.
అయితే ఈ విషయంపై రామ్ చరణ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది మెగా హేటర్స్ మొన్న అల్లు అర్జున్ ని జైలో వేసినట్టు ఇప్పుడు రామ్ చరణ్ పై కేసు పెడతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇందులో రామ్ చరణ్ తప్పులేదు.ఎందుకంటే ఆయన పర్మిషన్ తీసుకొనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టారు.అలాగే ఈ ఈవెంట్లో ఎక్కడ కూడా వీరికి అపాయం జరగలేదు. కానీ ఈవెంట్ చూసి వెళ్తుండగా వీరికి ఆ ప్రమాదం జరిగింది.కాబట్టి ఇందులో రామ్ చరణ్ చేసిన తప్పేమీ లేదు. కానీ ఫ్యామిలీకి మాత్రం ఆ సినిమా ఈవెంట్ చూడడానికి వెళ్లి మరణించారు అనే బాధ ఎప్పటికీ ఉంటుంది.(Game Changer)