Umair Sandu: హీరో హీరోయిన్ విడాకులు.. ఉమైర్ సందు షాకింగ్ ట్వీట్.?
Umair Sandu: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఉమైర్ సందు తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు. ఆ హీరో హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఈయన చేసిన ట్వీట్ బీటౌన్లో సంచలనం సృష్టిస్తోంది. మరి ఇంతకీ విడాకులు తీసుకోబోతున్న ఆ సెలబ్రెటీ జంట ఎవరయ్యా అంటే పేర్లు చెప్పకుండానే ఉమైర్ సందు ఆ సెలబ్రిటీ గురించి హింట్ ఇచ్చారు. మరి ఆయన ట్వీట్ లో ఏముందంటే.. బాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరో హీరోయిన్స్..

Umair Sandu shocking tweet on Bollywood Celebrety
అయితే ఆ హీరో కి రెండో పెళ్లి అయినప్పటికీ ఆ హీరోయిన్ కి మాత్రం మొదటి పెళ్లి.ఆ హీరో మొదటి పెళ్లి చేసుకున్న భార్యకు ఇద్దరు పెళ్ళీడుకు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. వారు ప్రస్తుతం సినిమాల్లో ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నారు. కొడుకు ఇప్పుడే మొదటి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు కూతురు మాత్రం హీరొయిన్ అయింది. ఇక రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కి కూడా 2 అబ్బాయిలు పుట్టారు. ( Umair Sandu)
Also Read: Naga Chaitanya: సమంతతో డివోర్స్.. ప్రతీ నెల 3 లక్షలు కట్టకపోతే..?
పిల్లలు పుట్టక ముందు వరుస సినిమాల్లో చేసిన ఈ హీరోయిన్ పిల్లలు పుట్టాక వారి బాధ్యత చూసుకోవడం కోసం కొద్ది రోజులు ఇంటి దగ్గరే ఉండి సినిమాలను పక్కన పెట్టింది.ఆ తర్వాత పిల్లలు పెద్దయ్యాక మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది.సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. అయితే అలాంటి ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వీరిద్దరి మధ్య గొడవలు వచ్చినట్టు సమాచారం. ఈ జంట విడాకుల విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేస్తుంది అంటూ పేరు చెప్పకుండా ఉమైర్ సందు సంచలన ట్వీట్ చేశారు. అలాగే ఆ హీరో కేవలం నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా రాణిస్తున్నారు అని హింట్ ఇవ్వడంతో చాలామంది ఉమైర్ సందు ట్వీట్ చూసినవాళ్లు ఆయన ఎవరో గుర్తుపట్టేస్తున్నారు. మరి ఆ హీరో హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే మీరు కూడా ఓ కామెంట్ చేయండి.( Umair Sandu)