Soundarya: సౌందర్య మరణంపై ఊహించని నిజం.. వాళ్లకి ముందే తెలిసిన చెప్పలేదా.?
Soundarya: కొంతమంది నటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో గుర్తింపు సాధించడమే కాకుండా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరంగా చూస్తే ఒకప్పటి సావిత్రి హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ పోటీ ఇచ్చిన హీరోయిన్.. ఆమె కోసం దర్శక, నిర్మాతలు, హీరోలు కూడా వెయిట్ చేసేవారు.. ఇక ఆమె మరణం తర్వాత ఆ స్థాయికి చేరుకున్న హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌందర్య..ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత కాలంలోనే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, వంటి స్టార్లు అందరితో నటించింది..

Unexpected truth about Soundarya death
ఇక ఆ టైంలో ఈమె డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు కూడా వెయిట్ చేసేవారు అంటే ఈమె ఎంతటి పాపులారిటీ పొందిందో మనందరికీ తెలుసు.. వచ్చిన కొంతకాలానికి ఎంతో ఎదగడంతో రాజకీయ పార్టీల వారు కూడా ఆమెను మా పార్టీకి రమ్మంటే మా పార్టీకి రమ్మని చాలావరకు అడిగారట.. అలా పార్టీ మీటింగ్ కు వెళ్తూ చివరికి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.. అయితే ఈమె చనిపోయిన తర్వాత ఈమె మరణం గురించి అనేక వార్తలు వచ్చాయి.. కానీ ఈమె మరణిస్తుందని వారి తల్లిదండ్రులకు ముందే తెలుసట.. అయినా వారు సౌందర్యకు చెప్పలేదు.. ఆ కారణం ఏంటో చూద్దాం..(Soundarya)
Also Read: Simbu: తూ..ఇది కథనా అంటూ డైరెక్టర్ పై ఉమ్మేసిన శింబు..!
సౌందర్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ చేశారు. ఆమె కూడా ఫ్యామిలీ చెప్పిన మాటలకు కట్టుబడి, ప్రతిదీ వారు చెప్పినట్టుగానే ముందుకు వెళ్లి స్టార్ గా మారింది. కానీ పెళ్లి విషయంలో మాత్రం అమ్మానాన్నల మాటలను బేఖాతారు చేసింది.. అయితే ఈమె జిఎస్ రఘు అనే వ్యక్తిని ప్రేమించింది.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది.. వారు వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని జాతకాలు చూపించారట..

కానీ వీరి జాతకంలో ఏదో దోషం ఉండడం వల్ల ఆయనను పెళ్లి చేసుకుంటే సౌందర్య మరణిస్తుందని ఎవరో సిద్ధాంతి ముందే చెప్పారట.. ఈ విషయాన్ని దాచి పెట్టి సౌందర్య తల్లిదండ్రులు ఆయన్ను నువ్వు పెళ్లి చేసుకోవద్దని గొడవకు దిగారట.. చివరికి సౌందర్య మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లిని కాదంటున్నారని ఆలోచనతో, పట్టుబట్టి మరీ ఆయన్ని పెళ్లి చేసుకుంది.. వీరి వివాహమైన కొంతకాలానికే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.. అయితే ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి చెప్పడంతో, కొంతమంది నెటిజెన్స్ తల్లిదండ్రుల మాట ఎప్పుడు కూడా మన మంచికే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు..(Soundarya)