Telangana: తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక
Telangana: తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక ఇచ్చింది. ఇవాళ జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి. నిజామాబాద్ కేంద్రంగా పనిచేయనున్నారు పసుపు బోర్డు. నిన్ననే పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించింది కేంద్రం. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.
Union Minister Piyush Goyal made the National Yellow Board virtual from Delhi
ఇక ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయల్ మాట్లాడుతూ….. మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని… చెప్పినదాన్ని చేసి చూపించడమే మోడీ ప్రభుత్వం విధానం అన్నారు. 40 రైతుల ఏళ్ల పసుపు బోర్డు కల నిజం చేశామని చెప్పారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు పని చేస్తుందని వివరించారు. దీని వల్ల పసుపు రైతుల అభివృద్ధికి మరింత ఊతం అని చెప్పారు పీయుష్ గోయల్.
Hardik Pandya-Janhvi: అందాల తారతో పాండ్యా రెండో పెళ్లి ?
ఈరోజు నుంచే పసుపు బోర్డు పనిచేయడం ప్రారంభిస్తుందని… స్పైస్ బోర్డు నిధులను ప్రస్తుతం దీనికి ఉపయోగిస్తామని ప్రకటించారు పీయుష్ గోయల్. వచ్చే బడ్జెట్లో పసుపు బోర్డుకు తగిన నిధులు ఇస్తామని తెలిపారు పీయుష్ గోయల్. పసుపు బోర్డు కు తగ్గిన అధికారులు సిబ్బందిని కేటాయిస్థామని… రెండేళ్లలో పసుపు ఉత్పత్తి రెండింతలు చేస్తామని పేర్కొన్నారు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయల్.