Ram Charan: ఉపాసన అంటే చిరాకు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.?
Ram Charan: మెగా పవర్ స్టార్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు నిర్మాతగా చేసిన దిల్ రాజు,శిరీష్ లకు పెద్ద నష్టం వచ్చి పడింది. కానీ ఆ నష్టం వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ తీర్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే.. గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ -4 కి గెస్ట్ గా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
Upasana means annoyance Ram Charan shocking comments
ఇక అప్పటి ఎపిసోడ్ రెండు భాగాలుగా వచ్చింది. ఇప్పటికే ఈ రెండు భాగాలు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ ఉపాసనలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి అని అడగగా ఉపాసనలో నాకు అన్ని నచ్చుతాయి. కానీ ఆమె పెళ్ళైనప్పటినుండి ఇప్పటివరకు లేటుగానే లేస్తుంది.ఆ విషయం నాకు చిరాకు పుట్టిస్తుంది.ఎన్నిసార్లు చెప్పినా అంతే అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు. (Ram Charan)
Also Read: Hyper Adi: వివాదంలో హైపర్ ఆది.. అల్లు ఫాన్స్ ని కెలికి..?
అలాగే ఉపసనకు కోపం వస్తే ఆమె టోన్ మారిపోతుందని,నా పేరు పిలిచే సమయంలో ఆమెటోన్ మారిపోయింది అంటే ఉపాసనకు కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలి అంటూ రాంచరణ్ చెప్పుకోచ్చారు. ఇక మేమిద్దరం మొదట కలుసుకున్న సమయంలో ఎప్పుడు గొడవలు పెట్టుకునే వారమని కానీ ఆ తర్వాత సడన్గా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
అలాగే ఉపాసనకి సేవ గుణం ఎక్కువగా ఉంటుంది.ఆమెలో ఉన్న సేవా గుణం చూసే నేను ఫిదా అయ్యాను. అది కూడా మా ప్రేమకి పెళ్లికి కారణం అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసనలో నచ్చని క్వాలిటీ రామ్ చరణ్ చెప్పడంతో ఉపాసన నిజంగానే అంత లేటుగా నిద్ర లేస్తుందా అని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.(Ram Charan)