Health: ఎర్ర కందిపప్పు అంటే చాలామంది ఇష్టంగా తింటారు. మరి కొంతమందికి ఎర్ర కందిపప్పు అంటే మాత్రం ఇష్టం ఉండదు. కందిపప్పు తినటం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుందని భయపడుతూ ఉంటారు. కానీ ఈ ఎర్ర కందిపప్పు కి మాత్రం గ్యాస్ వంటి సమస్యలు ఉండవు ఆరోగ్యంగా కూడా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారు ఎర్ర కందిపప్పును తినండి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది.
దీనితో బరువు తగ్గొచ్చు. ఎర్ర కందిపప్పును తరచూ తిండే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. రక్త హీనతతో బాధపడేవారు తమ డైట్ లో ఎర్ర కందిపప్పును చేర్చుకుంటే మంచిది. నాడీ వ్యవస్థ, మొదడు పనితీరుకు సహాయపడే మినరల్స్ ఎక్కువగా ఎర్ర కందిపప్పులో ఉంటాయి. ఈ పప్పు తినటం వల్ల మొదడు సంబంధ సమస్యలు దరి చేరవు. ఎర్ర కందిపప్పు నానబెట్టిన నీటిలో పసుపు, తేనె, రెండు నుంచి మూడు తాజా నారింజ తొక్కలు, బాదం పాలు కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ముఖానికి రాసి కడిగితే మిలమిల మెరవడం ఖాయం. స్కాల్ప్ ను శుభ్రపరచడానికి, ఎక్స్ ఫోలియేట్ చెయ్యటానికి ఎర్ర కందిపప్పును హెయిర్ మాస్క్ గా ఉపయోగించవచ్చు.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు, జుట్టు రాలడాన్ని కూడా ఇది నివారిస్తుంది. అకాల వృద్ధాప్యం, శరీరంపై ముడతలు, మచ్చలు వంటి సమస్యలను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు ఎర్ర కందిపప్పులో పుష్కలంగా ఉంటాయి. పాలు, రోజ్ వాటర్ కలిపి అందులో ఎర్ర కందిపప్పును రాత్రి నానబెట్టాలి. మరసటి రోజు ఉదయం పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. ముఖానికి పట్టించుకుని 20 నిమిషాల స్క్రబ్బింగ్ చేస్తే చర్మం సునితంగా మారుతుంది. ఎర్ర కందిపప్పు పొడిని పాలు, గుడ్లు తెల్ల సోనాత పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ చర్మం బిగుతుగా మారుతుంది. అందం రెట్టింపు అవుతుంది.