Goodachari 2: గూఢచారి 2 కోసం నానాతంటాలు పడుతున్న అడివి శేష్!!

Wamiqa Gabbi Role in Goodachari 2

Goodachari 2: తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అడివి శేష్, తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నటన అభిమానులను ఎంతగానో మెప్పించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన తన అభిమానుల కోసం ‘గూఢచారి 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Wamiqa Gabbi Role in Goodachari 2

‘గూఢచారి’ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గల భారీ అంచనాలు చూస్తే, సీక్వెల్‌పై కూడా చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. ఈ సినిమాను లోని ప్రతి పాత్రను మరింత ఆసక్తికరంగా చేయటం సినిమా పై మంచి ఎఫెక్ట్ ఉంటుందని యూనిట్ భావిస్తుంది. దాంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. వామిక గబ్బి ఇటీవలే ‘బేబీ జాన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం య్యారు. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘గూఢచారి 2’ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో అనేది అందరి ఆత్రుతగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక ఎడిషన్‌ను రిలీజ్ చేసి, వామిక గబ్బిపై ఓ అద్భుతమైన పోస్టర్ కూడా విడుదల చేశారు, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Wamiqa Gabbi Role in Goodachari 2

మరోవైపు, ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ ఈ జనరి నెల చివరి వారంలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ గ్లింప్స్ ద్వారా ప్రేక్షకులకు సినిమాకు సంబంధించిన మరింత స్పష్టమైన అవగాహన లభించే అవకాశం ఉంది. అడివి శేష్ కెరీర్‌లో ‘గూఢచారి 2’ సినిమా మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఈ సినిమా అన్ని విధాలుగా విజయవంతమవుతుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *