Varalakshmi Sarathkumar: 2500 కోసం అర్ధరాత్రి రోడ్డుపై ఐటెం డాన్సులు..?
Varalakshmi Sarathkumar: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి పాపులర్ నటిమణుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు.. వరలక్ష్మి ప్రస్తుతం చాలా బిజీ యాక్టర్ గా మారింది. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ వరలక్ష్మి శరత్ కుమార్ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం రోడ్డుపైన కూడా డాన్స్ చేసిందట.. ఆ తర్వాత తానంతట తానే ఒక్కో మెట్టెక్కుతూ హీరోయిన్ గా, కీలకమైన పాత్రలలో నటిస్తూ వస్తోంది..

Varalakshmi Sarathkumar lifestory
అలాంటి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి తాను ఎదిగిన విధానం గురించి బయట పెట్టింది.. తాను సినిమాల్లోకి రాకముందే మొదటిసారిగా ఒక షోలో రోడ్డుపైన డాన్స్ చేసిందట. అప్పుడు వారు ఆమెకు 2500 రూపాయలు ఇచ్చారని చెప్పుకొచ్చింది.. అలా రోడ్డుపైన కెరియర్ ను స్టార్ట్ చేశాను కాబట్టి, రోడ్డుపై డ్యాన్సులు చేయడాన్ని నేను తప్పు బట్టనని వెల్లడించింది. (Varalakshmi Sarathkumar)
Also Read: Savitri: మహానటి మూవీలో సావిత్రిని మోసం చేసిన సత్యం ఆయనేనా.?
ప్రస్తుతం వరలక్ష్మి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అమ్మడు ఆ స్థాయి నుంచి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయినా తాను ఇండస్ట్రీలో ఎదిగిన విధానాన్ని మాత్రం మర్చిపోకుండా తెలియజేసింది.

ఈ మధ్యకాలంలోనే పెళ్లి చేసుకొని తన సంసార జీవితాన్ని మరోవైపు సినిమాలతో హ్యాపీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈమె కురుమానాయకీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ గా రాబోతుందని తెలుస్తోంది. ఇది తెలుగు, తమిళ్, మలయాళం, భాషల్లో రానుందట.(Varalakshmi Sarathkumar)