VD12: విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్.. ఎప్పుడంటే?
VD12: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రోజునుంచి మంచి బజ్‌ను సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, సినిమా టైటిల్, టీజర్ విడుదల గురించి ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే టీజర్ విడుదల గురించి హింట్ ఇచ్చినా, అది ఇప్పటివరకు రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, చివరకు టీజర్ విడుదల తేదీ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా, ఈ అంచనాల చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 7న లాంచ్ చేయనున్నట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక టీజర్ కోసం అనిరుద్ సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించినట్లు తెలుస్తోంది. ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమా ను మే 30 న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.